India Open 2022 Badminton: ఇండియా ఓపెన్ 2022 ఫైనల్లో.. యువ షట్లర్ లక్ష్యసేన్ ఘన విజయం సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన పోటీల్లో సింగపుర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీయన్ యూను 24-22, 21-17 తేడాతో ఓడించాడు.
డబుల్స్‌లో కూడా..
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేసియా జోడి మోహమ్మద్ అహసన్-హెంద్రా సెతియావాన్లపై హోరాహోరీగా పోరాడి ఘన విజయం సాధించారు.
43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో.. రెండు వరుస సెట్లలో 21-16, 26-24 పాయింట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించారు.
ఇదీ చూడండి : 'దానికోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి'.. రెజ్లర్ వీరేందర్ ఆవేదన