ఆర్చరీ ప్రపంచకప్ రెండో దశ టోర్నీకి భారత్ దూరమైంది. భారత క్రీడాకారుల స్వల్పకాలిక వీసా దరఖాస్తుల్ని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం తిరస్కరించడమే ఇందుకు కారణం. ఈనెల 17 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని లుసానెలో ఈ టోర్నీ జరుగనుంది. ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం వల్ల జూన్ 23న పారిస్‌లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ మూడో దశ టోర్నీలో భారత ఒలింపిక్ క్రీడాకారులు బరిలో దిగనున్నారు.
ఇదీ చదవండి: సైనా, శ్రీకాంత్.. ఈసారి ఒలింపిక్స్‌కు కష్టమే?
"స్వల్పకాలిక వీసాకు స్విస్ రాయబార కార్యాలయం అనుమతించలేదు. టోర్నీకి సమయం కూడా తక్కువగా ఉంది. ఇప్పుడు మా దృష్టంతా పారిస్ ప్రపంచకప్‌పైనే. పారిస్‌లో పది రోజుల క్వారంటైన్ సమయంలో ప్రాక్టీస్‌కు అవకాశం కల్పించాలని ఫ్రెంచ్ ఆర్చరీ సమాఖ్యకు విజ్ఞప్తి చేస్తాం. ఈసారి కాంపౌండ్ ఆర్చర్లు ప్రపంచకప్ బరిలో ఉంటారు" అని భారత ఆర్చరీ సంఘం కార్యదర్శి ప్రమోద్ చందుర్కర్ తెలిపాడు.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ వద్దంటూ వేలాది సంతకాలు!