ETV Bharat / sports

మరోసారి ఆసియా టైటిల్​ విజేతగా పంకజ్​ అడ్వాణీ - pankaj advani latest news

ఆసియా స్నూకర్​ ఛాంపియన్​షిప్​లో(Asian Snooker Championship 2021) భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్​ క్రీడాకారుడు పంకజ్​ అడ్వాణీ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఇరాన్​కు చెందిన అమిర్​ సర్ఖోష్​పై 6-3తో విజయం సాధించాడు.

In his first tournament in two years, Advani manages to defend Asian title
స్నూకర్​ ప్లేయర్​ పంకజ్​ అడ్వాణీకి ఆసియా టైటిల్​
author img

By

Published : Sep 17, 2021, 7:42 AM IST

కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి బరిలో దిగిన తొలి టోర్నీలోనే భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్‌ క్రీడాకారుడు పంకజ్‌ అడ్వాణీ(Pankaj Advani is Associated With) ఛాంపియన్‌గా నిలిచాడు. ఆసియా స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో(Asian Snooker Championship 2021) తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. గురువారం ఫైనల్లో అతను 6-3 తేడాతో అమిర్‌ సర్ఖోష్‌ (ఇరాన్‌)పై విజయం సాధించాడు.

వరుసగా తొలి మూడు ఫ్రేమ్‌లు గెలిచిన పంకజ్‌ 3-0 ఆధిక్యంతో దూసుకెళ్లాడు. మధ్యలో కాస్త వెనకబడ్డప్పటికీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపుతో(Asian Snooker Championship 2021 Results) మ్యాచ్‌ ముగించాడు. 2019లో చివరగా పంకజ్‌ ఈ టైటిల్‌ గెలిచాడు. గతేడాది కరోనా సంక్షోభం కారణంగా టోర్నీ జరగలేదు. ఇప్పటివరకూ స్నూకర్​, బిలియర్డ్స్​లో కలిపి మొత్తం 11 ఆసియా టైటిళ్లు పంకజ్​ అడ్వాణీ ఖాతాలో ఉన్నాయి.

ఇదీ చూడండి.. Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.