చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన తండ్రి కె. విశ్వనాథన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు. గురువారం అనారోగ్యం కారణంగా మృతిచెందిన ఆయనను స్మరించుకున్నాడు ఆనంద్.
"ఏప్రిల్ 15న మా తండ్రి కె. విశ్వనాథన్ అనారోగ్యంతో మృతిచెందారు. చెన్నైలో ఉన్నప్పుడు ఆయనను తరచూ కలిసే అవకాశం వచ్చేది. ఆయనకు నేను రుణపడి ఉంటా. చెస్ కెరీర్లో ఎదగడానికి మా తల్లి ఎంతగానో సహకరించారు. తండ్రి పాత్ర మరింత కీలకం. ఆయన ఎప్పడూ నాకు మద్దతుగా నిలిచేవారు. మూడు జాతీయ టైటిళ్లు, ప్రపంచ ఛాంపియన్ టైటిల్ గెలిచినప్పుడు ఆయన నాకు ఇచ్చిన ధైర్యాన్ని మరచిపోలేను. ప్రతిసారి నాకు సరైన సలహాలు ఇస్తుండేవారు"
--విశ్వనాథన్ ఆనంద్, మాజీ చెస్ ఛాంపియన్.
తండ్రితో గడిపిన ఆనందక్షణాలను మర్చిపోలేనని విశ్వనాథన్ అన్నాడు. రైల్వే ఉద్యోగంలో తన తండ్రి సాధించిన ఘనతలకు గర్వపడుతున్నట్లు తెలిపాడు.
ఇదీ చదవండి:కేఎల్ రాహుల్.. 'పంజాబ్' కింగ్ మేకర్!