ETV Bharat / sports

ఆసియన్​ ఛాంపియన్​షిప్స్​: క్వార్టర్స్​లోకి హుసాముద్దీన్​

ఆసియన్​ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో భారత బాక్సర్​ హుసాముద్దీన్ అదిరే ఆరంభమిచ్చాడు. కజకిస్థాన్​ బాక్సర్​ సబిర్​ ఖాన్​పై విజయంతో క్వార్టర్స్​లోకి అడుగుపెట్టాడు. తన తదుపరి మ్యాచ్​లో మిరాజిజ్​బెక్​తో తలపడనున్నాడు భారత బాక్సర్​.

Hussamuddin, indian boxer
హుసాముద్దీన్, భారత బాక్సర్
author img

By

Published : May 24, 2021, 10:10 PM IST

దుబాయ్​ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్​ ఆసియన్ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో భారత్​కు​ శుభారంభం దక్కింది. కామన్వెల్త్​ గేమ్స్​ కాంస్య పతక విజేత మహమ్మద్​ హుసాముద్దీన్​(56 కేజీ).. కజకిస్థాన్​ బాక్సర్​ మఖ్ముద్​ సబిర్​ ఖాన్​పై విజయం సాధించాడు. రెండు సార్లు ఆసియన్ యూత్​ ఛాంపియన్​ అయిన సబిర్​ ఖాన్​ను 5-0 తేడాతో మట్టికరిపించి క్వార్టర్​ ఫైనల్లోకి అడుగుపెట్టాడు భారత బాక్సర్.

హుసాముద్దీన్​ తన తదుపరి రౌండ్​లో కఠిన ప్రత్యర్థితో తలపడనున్నాడు. ఆసియన్​ గేమ్స్ ఛాంపియన్​ మిరాజిజ్​బెక్​ మిర్జాహాలిలోవ్​తో పోటీలోకి దిగనున్నాడు.

పోటీల్లో భాగంగా మంగళవారం మహిళా బాక్సర్లు సిమ్రాన్​జీత్​ కౌర్​, సాక్షి, జాస్మిన్, సంజీత్​ ​​తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇదీ చదవండి: 'కోహ్లీ స్లెడ్జింగ్​ను నేను ఎంజాయ్​ చేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.