భారత స్టార్ అథ్లెట్ హిమాదాస్ ఒకే వారంలో రెండు స్వర్ణాలు నెగ్గి దూసుకుపోతోంది. పోలాండ్‌లో ఆదివారం జరిగిన కుట్నో అథ్లెట్ మీట్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి కైవసం చేసుకుంది హిమాదాస్. గత గురువారం నాడు పోజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లోనూ స్వర్ణం నెగ్గింది.
ఆదివారం జరిగిన ఈ ఈవెంట్లో 200 మీటర్ల పరుగును 23.97 సెకండ్లలో ముగించింది హిమాదాస్. మరో భారత స్ప్రింటర్ వీకే విస్మయ 24.06 సెకండ్లలో గమ్యాన్ని చేరి రజతంతో సరిపెట్టుకుంది.
వెన్నునొప్పితో కొన్ని నెలలుగా పరుగుకు దూరమైన హిమా పునరాగమనంలో అదరగొట్టింది. గురువారం జరిగిన 200 మీటర్ల విభాగంలో 23.65 సెకండ్లలో స్వర్ణం నెగ్గగా.. ఆదివారం 23.97 సెకండ్లలో రేసును ముగించింది. గతేడాది 23.10సెకండ్లతో కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిందీ అసోం రన్నర్.
ఆదివారం జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో జాతీయ పతక విజేత మహ్మద్ అనాస్ స్వర్ణం నెగ్గాడు. 21.18 సెకండ్లలో పరుగును ముగించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇది చదవండి: WC19: గతం అనవసరం.. విరాట్‌తో రోహిత్