స్టార్ స్ప్రింటర్ హిమదాస్ మరోసారి సత్తా చాటింది. మహిళల 200 మీటర్ల పరుగులో పసిడి సొంతం చేసుకుంది. పోలాండ్లోని 'పోజ్నన్ అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్'లో ఈ పతకం సాధించింది.
జాతీయ స్థాయిలో, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ టోర్నీల్లో 400 మీటర్ల పరుగులో ఎన్నో పతకాలు సాధించింది హిమ. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతోంది. కాని తాజాగా పోలాండ్‌లో జరిగిన పోటీల్లో 23.65 సెకన్లలో 200 మీటర్ల రేసును పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది. ఇదే ఈ ఏడాది హిమకు దక్కిన తొలి పతకం. ఈమె గతేడాది ఇదే దూరాన్ని 23.10 సెకన్లలో పూర్తి చేసి కెరీర్ అత్యుత్తమం నమోదు చేసింది.
మరో భారత స్ప్రింటర్ వీకే విస్మయా 23.75 సెకన్లలో 200 మీటర్ల రేసును పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల ఈవెంట్‌ని మహ్మద్ అనాస్ 20.75 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల రేసులో కేఎస్ జీవన్ కాంస్య పతకం సాధించాడు. తేజేందర్‌పాల్ సింగ్ తూర్ ఈవెంట్‌ని 19.62 మీటర్లతో పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించాడు.
ఇదీ చూడండి- పద్దు-19: కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్