కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల టోక్యోలో అత్యయిక స్థితి విధించారు. ఈ కారణంగానే త్వరలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించమని నిర్వహకులు స్పష్టం చేశారు. అయితే ఆగస్టు 24 మొదలయ్యే పారాలింపిక్స్‌లో మాత్రం ప్రేక్షకులు సందడి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోక్యోలో విధించిన ఆత్యయిక స్థితి ఆగస్టు 22తో పూర్తి కానుండటమే ఇందుకు కారణం.
ఇదే విషయంపై ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు సీకో హషిమోటో స్పందించారు. ఆగస్టు 8న ఒలింపిక్స్ ముగిసిన వెంటనే.. దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా కారణంగా ఒకవేళ ఒలింపిక్స్ వాయిదా పడితే.. పారాలింపిక్స్ సన్నద్ధతపై ప్రభావం పడుతుందని వివరించారు. ఒలింపిక్స్‌లో 11వేల మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా, పారాలింపిక్స్‌లో 4,400 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు.
ఇదీ చదవండి: Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్