స్విట్జర్లాండ్‌లోని బియల్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో.. తెలుగుతేజం, భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. బ్లిట్జ్‌లో ఇప్పటికే టైటిల్ గెలుచుకున్న ఈ యువ ప్లేయర్.. ర్యాపిడ్‌లో రెండో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో హరి మొత్తం 10 పాయింట్లతో విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో కలిసి సమానంగా నిలిచాడు.
టై బ్రేకర్‌లో నెగ్గిన హరి.. రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 12 పాయింట్లు సాధించిన రదోస్లోవ్ (పోలెండ్) టైటిల్ గెలుచుకున్నాడు. కరోనా మహమ్మారి తర్వాత జరుగుతున్న తొలి ముఖాముఖీ చెస్ టోర్నీ ఇదే.