ETV Bharat / sports

'ఫ్రొఫెషనల్ చెస్​​ ప్లేయర్లు మోసం చేయరు!'

ఆన్​లైన్​ చెస్​లో మోసం చేసే అవకాశముందన్న భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక.. బోర్డు ముందు ముఖాముఖి తలపడితేనే మజా ఉంటుందని తెలిపింది. లాక్‌డౌన్‌ విధించిన మొదట్లో ఆన్‌లైన్‌ చెస్‌కు గణనీయంగా పెరిగిన డిమాండ్​.. ప్రస్తుతం తగ్గిపోతోందని వెల్లడించింది.

Dronavalli Harika
ద్రోణవల్లి హారిక.
author img

By

Published : Jul 15, 2020, 7:06 AM IST

బోర్డు మీద ఎదురెదురుగా కూర్చొని తలపడే చదరంగానికి.. ఆన్‌లైన్‌ చెస్‌ ప్రత్యామ్నాయం కాబోదని భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తెలిపింది. చెస్‌లో ముఖాముఖి తలపడితేనే మజా ఉంటుందని, అదే అసలైన ఆట అని వెల్లడించింది. ఆన్‌లైన్‌ చెస్‌ వీక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెప్పుకొచ్చింది.

ప్రత్యామ్నాయం కాబోదు

కరోనా మహమ్మారితో మిగతా క్రీడలపై తీవ్ర ప్రభావం పడగా.. చెస్‌ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇంట్లో ఊరికే కూర్చోవడం బదులు ఆన్‌లైన్‌ చెస్‌తో బిజీగా ఉంటున్నాం. అయితే ముఖాముఖి చదరంగానికి ఆన్‌లైన్‌ చెస్‌కు చాలా తేడా ఉంది. బోర్డు మీద ఆడే చెస్‌ పూర్తిగా భిన్నం. చేతులతో పావులు కదుపుతూ.. ప్రత్యర్థి కళ్లలోకి చూస్తూ ఆత్మవిశ్వాసం లేదా భయాన్ని గమనిస్తూ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తునప్పుడు కలిగే భావోద్వేగాలు ఆన్‌లైన్‌ చెస్‌లో ఉండవు.

ఆన్‌లైన్‌ ఆట మౌజ్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎంత వేగంగా మౌజ్‌ కదిలిస్తే వారే ముందుంటారు. వేగంగా ఎత్తులు వేసే క్రమంలో తప్పులు దొర్లినా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ముఖాముఖి ఆటకు ఆన్‌లైన్‌ చెస్‌ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదు.

Dronavalli Harika
భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక

ఇంట్లో కూర్చొని ఆడేది కాదు

లాక్‌డౌన్‌ విధించిన మొదట్లో ఆన్‌లైన్‌ చెస్‌కు వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పుడు అందరూ ఇంట్లో ఉండటం వల్ల చెస్‌ ఆడటం.. చూడటం అలవాటు చేసుకున్నారు. మార్చి, ఏప్రిల్‌తో పోల్చుకుంటే వీక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులో మరింత తగ్గొచ్చు. అయితే ఇది అసలైన సీరియస్‌ చెస్‌ కాదని గుర్తించాలి. ఇంటర్నెట్‌ చెస్‌కు అలవాటు పడి అదే అసలైన చదరంగం అనుకునే ప్రమాదమూ లేకపోలేదు. బోర్డుపై ఆడేదే అసలైన చెస్‌.

చదరంగం మెదడుకు సంబంధించిన ఆట. పూర్తిగా ప్రత్యేకం. ఇంట్లో కూర్చొని ఆడేది క్రీడ కాదు. క్రీడాకారులు ఎదురెదురుగా తలపడాలి. అయితే మిగతా క్రీడలతో పోలిస్తే చెస్‌ ఆగకపోడానికి కారణం ఆన్‌లైనే. బ్లిట్జ్‌, ర్యాపిడ్‌ మాదిరే భవిష్యత్తులో ఆన్‌లైన్‌ చెస్‌ ఒక ఫార్మాట్‌గా కొనసాగుతుందని అనుకుంటున్నా.

ఈ ఏడాదికి ఇంతే!

ఆన్‌లైన్‌ చెస్‌తో పోల్చుకుంటే ముఖాముఖి చదరంగానికే స్పాన్సర్లు ఎక్కువ. మార్కెట్‌, ఆదాయం అధికం. ప్రస్తుతం అలాంటి టోర్నీలు లేవు కాబట్టి నిధుల్ని ఆన్‌లైన్‌ చెస్‌కు మళ్లిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆన్‌లైన్‌ చెస్‌ ఆదాయం బాగుంది. భవిష్యత్తులో ఎవరి పనిలో వారు పడితే చూసేవాళ్లు తగ్గిపోతారు. కరోనా వల్ల మిగతా క్రీడల మాదిరి చెస్‌కు నష్టం జరగలేదు. మంచి కూడా జరిగిందని చెప్పలేం.

ఒలింపియాడ్‌ వాయిదా పడింది. ప్రపంచకప్‌ కూడా అనుమానమే. నవంబరులో టోర్నీలు జరిగే అవకాశముందని అంటున్నారు. అదికూడా పది మంది వరకు ఆడే టోర్నీలే. 200, 300 మందిని ఒక చోట ఆడించలేరు. 3000, 4000 మంది బరిలో ఉండే ఒలింపియాడ్‌ను మరిచిపోవాల్సిందే. ఎక్కువ దేశాలు, చాలామంది క్రీడాకారులు పోటీలో ఉండే టోర్నీలు ఈ ఏడాదికి లేనట్లే!

Dronavalli Harika
భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక

ఆత్మావలోకనం చేసుకోవాలి

క్రీడాకారుల కెరీర్‌లో ఒక ఏడాది పోయినట్లే. ఈ పరిస్థితిని సానుకూలంగా మలుచుకోవాలి. ఇప్పటి వరకు క్షణం తీరిక లేకుండా గడిపాం. కనీసం ఇప్పుడైనా మనల్ని మనం తెలుసుకునే అవకాశం లభించింది. ఆత్మావలోకనం చేసుకునేందుకు సరైన సమయమిది. చెస్‌ క్రీడాకారుల పరిస్థితి మెరుగ్గానే ఉంది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఆన్‌లైన్‌ చెస్‌ ఆడుతూ బిజీగానే ఉంటున్నారు. కానీ వివిధ రంగాల వారి పరిస్థితే ఘోరంగా తయారైంది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కష్టాలు తప్పవేమో.

ప్రొఫెషనల్స్‌ అలా చేయరు

మేం ఆడుతున్న ఆన్‌లైన్‌ చెస్‌లో వెబ్‌ క్యామ్‌ తప్పనిసరి. నిర్వాహకులకు స్క్రీన్‌ షేర్‌ చేయాలి. వాళ్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ప్రొఫెషనల్‌ క్రీడాకారులు మోసం చేయరు. అయితే ప్రైజ్‌మనీ కోసమో.. మరో దాని కోసమో ఆన్‌లైన్‌ చెస్‌లో మోసం చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం. కంప్యూటర్‌ సహాయం తీసుకోవడం.. సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఎత్తులకు పైఎత్తులు వేయడం లాంటివి. టాప్‌ క్రీడాకారులు అలాంటి పని చేయకపోవచ్చు. టాప్‌-100లోపు వాళ్లు కూడా మోసం చేసే అవకాశాలు తక్కువ. చిన్న చిన్న టోర్నీలు.. ఎక్కువ మంది పాల్గొనే ఈవెంట్లు.. వెబ్‌ క్యామ్‌ లేని సందర్భాల్లో మోసం జరిగే అవకాశాలు అధికం.

Dronavalli Harika
భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక

ఇది చూడండి : క్రికెటర్ల కోసం మానసిక వైద్య నిపుణుల నియామకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.