ETV Bharat / sports

Usain Bolt: మళ్లీ ట్రాక్​పైకి ఉసేన్​ బోల్ట్​! - మరోసారి ట్రాక్​పైకి బోల్ట్

పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్(Usain Bolt)​.. మరోసారి రన్నింగ్ ట్రాక్​పై కనిపించనున్నాడు. అదేదో పోటీలో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 800 మీ. పరుగులో పాల్గొననున్నాడు.

usain bolt, Going the extra half-mile
ఉసేన్ బోల్ట్, పరుగుల వీరుడు
author img

By

Published : Jul 7, 2021, 10:12 AM IST

Updated : Jul 7, 2021, 11:54 AM IST

100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పోటీల్లో దాదాపు దశాబ్దంన్నర పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించి.. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో బోలెడన్ని పతకాలు సాధించిన ఉసేన్ బోల్ట్(Usain Bolt) త్వరలోనే 800 మీటర్ల పరుగులో పోటీ పడబోతున్నాడు. నాలుగేళ్ల కిందటే ట్రాక్​కు టాటా చెప్పేసిన ఉసేన్.. ఇప్పుడు కొత్తగా 800 మీ. పరుగులో కొత్తగా కెరీర్ వెతుక్కుంటున్నాడేంటి అని ఆశ్చర్యపోకండి.

ఇది కేవలం ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రేసే. జులై 13న ఈ పోటీ జరగనుంది. దీని కోసం తాను కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు బోల్ట్ వెల్లడించాడు. 2017 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో వైఫల్యం తర్వాత పరుగు ఆపేసిన బోల్ట్.. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు సంగీతం మీద దృష్టిపెట్టాడు. ఇటీవలే అతడి భార్య కవలలకు జన్మనిచ్చింది.

ఇదీ చదవండి: బోల్ట్‌ మెచ్చినోడు.. బోల్ట్‌ను మించినోడు

Last Updated : Jul 7, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.