ETV Bharat / sports

ఒలింపిక్స్​లో ఆలింగనం బ్యాన్- లక్షన్నర కండోమ్స్​ రెడీ! - rulebook

జులై 23 నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్ రూల్​బుక్​ను విడుదల చేశారు నిర్వాహకులు. అథ్లెట్లు.. కరచాలనాలకు, ఆలింగనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

from no hugs to 150000 condoms here are the details
టోక్యో ఒలింపిక్స్ 2020​ రూల్​బుక్​ విడుదల
author img

By

Published : Feb 10, 2021, 12:46 PM IST

ఈ ఏడాది జులై 23 నుంచి తలపెట్టిన టోక్యో 2020 ఒలింపిక్స్​కు సంబంధించి రూల్​బుక్​ను విడుదల చేశారు​ నిర్వాహకులు. కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా వేడుకలో.. ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను 33 పేజీల పుస్తకంలో వెల్లడించారు. వీలైనంత వరకు బయట ప్రదేశాల్లో తిరగొద్దని, కరచాలనాలు ఇవ్వవద్దని, ఆలింగనాలు చేసుకోవద్దని సూచించారు. జపాన్​లో ఉన్నంత కాలం కొవిడ్​ ముప్పును తగ్గించుకోవడానికే ప్రయత్నించాలని పేర్కొన్నారు.

ఒలింపిక్స్​ రూల్​బుక్​ మార్గదర్శకాలు:

  • ఆటగాళ్లు తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలి. ట్రైనింగ్​, ఆటలు ఆడేటప్పుడు, తినేటప్పుడు, పడుకున్నప్పుడు వాడాల్సిన పనిలేదు.
  • ప్రతి నాలుగు రోజులకోసారి అథ్లెట్లకు కరోనా పరీక్ష చేస్తారు. ఒకవేళ పాజిటివ్ రిపోర్టు వస్తే ఒలింపిక్స్​ నుంచి బహిష్కరిస్తారు.
  • ఆటగాళ్లు కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినా ఒలింపిక్స్​ నుంచి పంపించేస్తారు.
  • గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లక్షా 50వేల కండోమ్​లను ఉచితంగా అథ్లెట్లకు ఇవ్వనున్నారు. పరిచయం లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకపోవడానికే ఆటగాళ్లు మొగ్గు చూపాలని ఒలింపిక్ కమిటీ సూచించింది.
  • జపాన్​కు వచ్చిన 72 గంటల తర్వాత అథ్లెట్లకు కరోనా పరీక్ష నిర్వహిస్తారు. వారికి ఎటువంటి క్వారంటైన్​ ఉండదు. శిక్షణ క్యాంపుల్లో పాల్గొనడానికి అనుమతిస్తారు.
  • జిమ్​లకు, పర్యటక​ ప్రాంతాలు, దుకాణాలు, రెస్టారెంట్లకు వెళ్లడానికి అథ్లెట్లకు అనుమతి లేదు. కేవలం క్రీడా వేదికలతో పాటు రూల్​బుక్​లో పేర్కొన్న ప్రాంతాలకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

ఆటగాళ్ల శ్రేయస్సు కోసమే సదరు నిబంధనలు విధించామని ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఈ నిబంధనలను ఏప్రిల్​, జులైలో మరోసారి మార్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి బోపన్న ఔట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.