ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్‌కు దూసుకొచ్చిన స్కేట్‌బోర్డ్​

మన దేశంలో మహా అయితే కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే కాళ్లకు స్కేట్‌బోర్డు కట్టుకుని విన్యాసాలు చేసే యువత కనిపిస్తుంది. విదేశాల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ సరదాగా స్కేట్‌బోర్డు ఎక్కి.. రయ్‌మంటూ దూసుకెళ్లే వాళ్లే. వీధుల్లో.. రహదారుల్లో ఇలా స్కేట్‌బోర్డులతో విన్యాసాలు చేసేవాళ్లు ఎంతోమంది. ఇలా ఏదో కాలక్షేపం కోసం చేసే విన్యాసాలే.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కనువిందు చేయనున్నాయి. ఒలింపిక్స్‌లో స్కేట్‌బోర్డింగ్‌ను ప్రవేశపెట్టడమే అందుకు కారణం.

skateboarding
ఒలింపిక్స్‌
author img

By

Published : Jul 16, 2021, 7:29 AM IST

టోక్యో క్రీడలతో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయబోతున్న నాలుగు క్రీడాంశాల్లో స్కేట్‌ బోర్డింగ్‌ ఒకటి. దీంతో పాటు కరాటె, సర్ఫింగ్‌, స్పోర్ట్‌ క్లైంబింగ్‌ను తొలిసారి ఒలింపిక్స్‌లో నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా స్కేట్‌బోర్డింగ్‌ పోటీల కోసం నిర్వాహకులు టోక్యో సముద్ర తీరంలో ఓ పార్కును రూపొందించారు. టోక్యోలో ఈ కొత్త ఆట సందడి ఎలా ఉంటుందో చూడాలి. 12 ఏళ్ల బ్రిటన్‌ బాలిక స్కై బ్రౌన్‌ ఈ పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

  • స్కేట్‌బోర్డింగ్‌లో రెండు విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి. ఈ విభాగాల్లో మహిళల, పురుషుల్లో వేర్వేరుగా విజేతలను నిర్ణయించి పతకాలు అందించనున్నారు. అందులో ఒకటి పార్క్‌ కాగా మరొకటి స్ట్రీట్‌.
  • పార్క్‌ విభాగంలో పోటీ అంటే.. వివిధ వంపులతో కూడిన ప్రాంతంలో స్కేటింగ్‌ చేయడం.
  • స్ట్రీట్‌ విభాగం అంటే.. వీధుల్లో మెట్లపై, గోడలపై స్కేటింగ్‌ చేస్తూ విభిన్నమైన సవాళ్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఈ రెండు విభాగాల్లోనూ ప్రిలిమ్స్‌, ఫైనల్స్‌ రౌండ్లు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో.. నాలుగు హీట్లలో అయిదుగురు స్కేటర్ల చొప్పున మొత్తం 20 మంది పోటీపడతారు. వాళ్లలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్కేటర్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
  • పార్క్‌ విభాగంలో స్కేటర్‌ బెస్ట్‌ ఆఫ్‌ త్రీ 45 సెకన్ల రేస్‌ స్కోరును ఫైనల్‌ రౌండ్‌ స్కోరుగా పరిగణిస్తారు. అయిదుగురు న్యాయనిర్ణేతలు స్కేటర్‌ ప్రదర్శన ఆధారంగా 0-100 మధ్యలో పాయింట్లు ఇస్తారు. వాటిల్లో ఎక్కువ, తక్కువ వచ్చిన స్కోర్లను తప్పించి.. మిగతా మూడింటిని సగటు తీసి ఫైనల్‌ స్కోరుగా నిర్ణయిస్తారు.
  • స్ట్రీట్‌ విభాగంలో స్కేటర్లు రెండు 45 సెకన్ల రేస్‌తో పాటు అయిదు ట్రిక్కులు చేయాల్సి ఉంటుంది. న్యాయనిర్ణేతలు ఇచ్చిన స్కోరు (0-10)లో ఎక్కువ, తక్కువ పాయింట్లను తప్పించి మిగతా ముగ్గురు ఇచ్చిన దాన్ని సగటు తీసి ఫైనల్‌ స్కోరు ప్రకటిస్తారు. స్కేటర్ల అతి క్లిష్టమైన విన్యాసాలు, ట్రిక్స్‌ను అమలు పరిచిన విధానం, అడ్డంకులను దాటుకున్న తీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని న్యాయ నిర్ణేతలు పాయింట్లు ఇస్తారు.
  • స్ట్రీట్‌ పోటీలు ఈ నెల 25, 26 తేదీల్లో, పార్క్‌ పోటీలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరగనున్నాయి.

ఇదీ చూడండి: Tokyo Olympics: సూపర్ ఫామ్‌లో భారత జట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.