ETV Bharat / sports

హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత.. సత్తా చాటిన బాక్సర్ సుమిత్‌

ఎఫ్​ఐహెచ్​ మహిళల హాకీ ప్రొ లీగ్​ పోరులో బరిలో దిగే భారత జట్టుకు గోల్​కీపర్​ సవిత్​ కెప్టెన్​గా వ్యవహరించనుంది. కాగా, స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సుమిత్‌ కుందు స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించాడు.

FIH womens Hockey pro league
హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత
author img

By

Published : Feb 22, 2022, 6:58 AM IST

women's hockey team captain: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ప్రొ లీగ్‌ పోరులో పాల్గొనే భారత జట్టుకు గోల్‌కీపర్‌ సవిత సారథ్యం వహించనుంది. గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్‌ రాణి రాంపాల్‌ స్థానంలో సవితకు పగ్గాలు అప్పగించారు. దీప్‌ గ్రేస్‌ ఎక్కా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. తెలుగమ్మాయి ఎతిమరపు రజని (గోల్‌కీపర్‌)కి జట్టులో చోటు లభించింది. ఈనెల 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో భారత్‌ తలపడనుంది.
భారత హాకీ జట్టు: గోల్‌కీపర్లు: సవిత (కెప్టెన్‌), బిచు దేవి, రజని, డిఫెండర్లు: దీప్‌ గ్రేస్‌ ఎక్కా (వైస్‌ కెప్టెన్‌), గుర్జిత్‌ కౌర్‌, నిక్కి ప్రధాన్‌, ఉదిత, ఇషిక చౌదరి, మిడ్‌ఫీల్డర్లు: నిష, సలీమా, సుశీల చాను, జ్యోతి, మోనిక, నేహా, నవజ్యోత్‌ కౌర్‌, నమిత, ఫార్వర్డ్‌లు: వందన కటారియా, షర్మిల దేవి, నవనీత్‌ కౌర్‌, లాల్రెమ్సియామి, సంగీత కుమారి, రజ్విందర్‌ కౌర్‌, స్టాండ్‌బైలు: రష్మిత, అక్షత, సోనిక, మరియానా, ఐశ్వర్య

సత్తా చాటిన సుమిత్‌

Boxer sumith: స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సుమిత్‌ కుందు స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించాడు. 75 కేజీల విభాగం రెండో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత బిజ్‌హమోవ్‌ (రష్యా)కు సుమిత్‌ షాకిచ్చాడు. కేవలం రెండో అంతర్జాతీయ టోర్నీ ఆడుతున్న సుమిత్‌ ఈ పోరులో 5-0తో ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. మరోవైపు నరేందర్‌ బెర్‌వాల్‌ (92 కేజీల పైన), వీరేందర్‌ సింగ్‌ (60 కేజీలు), లక్ష్య చాహర్‌ (86 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. నరేందర్‌ 2-3తో ఆయూబ్‌ (స్పెయిన్‌) చేతిలో.. వీరేందర్‌ 0-5తో ఆర్థర్‌ (రష్యా) చేతిలో, చాహర్‌ 1-4తో అటాయెవ్‌ (రష్యా) చేతిలో పరాజయం చవిచూశారు. ఈ టోర్నీలో భారత్‌ నుంచి 17 మంది బాక్సర్లు (ఏడుగురు పురుషులు, పది మంది మహిళలు) పోటీపడుతున్నారు.

ఇదీ చూడండి: పూరన్​ను రూ.10కోట్లు పెట్టి హైదరాబాద్​ కొనడానికి కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.