ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన హామిల్టన్​- షుమాకర్​ రికార్డు బద్దలు - portiguse grand pre result

ఫార్ములా వన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (ఇంగ్లాండ్‌) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం పోర్చుగల్​లోని పార్టిమావోలో జరిగిన 'పోర్చుగీస్‌ గ్రాండ్‌ప్రి'లో విజేతగా నిలిచాడు. హామిల్టన్‌ (మెర్సీడెజ్‌) ఫార్ములా వన్‌ చరిత్రలో అత్యధికంగా 92 టైటిళ్లతో షుమాకర్​ రికార్డును బద్దలు కొట్టాడు.

farmula-one-racer-hamilton-new -record
హామిల్టన్‌ ఖాతాలో మరో రికార్డు
author img

By

Published : Oct 27, 2020, 7:06 AM IST

ప్రపంచ ఛాంపియన్​ ఫార్ములా వన్ రేసర్​ లూయిస్​ హామిల్టన్(ఇంగ్లాండ్​) చరిత్ర సృష్టించాడు. ఫార్ములా వన్​ చరిత్రలో అత్యధికంగా 92 టైటిళ్లు సాధించిన డ్రైవర్​గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. షుమాకర్‌ పేరిట ఉన్న 91 టైటిళ్ల రికార్డును అతను తుడిచిపెట్టాడు. ఆదివారం ఉత్కంఠగా సాగిన పోర్చుగీసు రేసులో హామిల్టన్‌.. సహచర మెర్సీడెజ్‌ డ్రైవర్‌ బొటాస్‌ కంటే 25.6 సెకన్ల ముందు రేసును పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్సాపన్‌ మూడో స్థానంలో నిలిచాడు.

ఈ విజయంతో సీజన్‌లో 8వ టైటిల్‌ హామిల్టన్‌ సొంతమైంది. మరో అయిదు రేసులున్న ఈ సీజన్‌లో 77 పాయింట్లతో ఛాంపియన్‌షిప్‌ రేసులో హామిల్టన్‌ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.