టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం వల్ల చాలా నిరాశ చెందానని చెప్పింది భారత యువ మహిళా షూటర్ మను బాకర్. అయినా ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు తెలిపింది. 'ఈటీవీ భారత్'తో శనివారం జరిగిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
అటు చదువును, ఇటు షూటింగ్.. ఇలా రెండు విషయాల్ని మేనేజ్ చేస్తూ లాక్డౌన్ను ఆస్వాదిస్తున్నానని మను తెలిపింది. ఇటీవలే ఈమె క్రీడా విభాగంలో అర్జున అవార్డు, ఖేల్రత్న అవార్డులకు నామినేట్ అయింది.
ఈ లాక్డౌన్ సమయంలో వంట నేర్చుకుంటున్నారా? అన్న ప్రశ్నకు.. "నాకు వంట చేయడం ఇష్టముండదు. కానీ ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాను" అని మను చెప్పింది. మూడో గ్రేడ్లో ఉన్నప్పటి నుంచి క్రీడల్లో పాల్గొంటున్నానని, ఈ విషయంలో ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులు తనకు ఉండటం నిజంగా అదృష్టమని పేర్కొంది.