ETV Bharat / sports

Sushil kumar: సుశీల్​తో పోలీసుల సెల్ఫీ.. విచారణకు ఆదేశం - తీహార్ జైలుకు సుశీల్ కుమార్

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు కస్టడీలో ఉన్నారు స్టార్ రెజ్లర్ సుశీల్​ కుమార్. ఇతడిని దిల్లీలోని మండోలీ జైలు నుంచి తీహార్ జైలుకు శుక్రవారం తరలించారు. ఈ సమయంలో కొందరు పోలీసులు అతడితో సెల్ఫీలు దిగడంపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Sushil
సుశీల్ కుమార్
author img

By

Published : Jun 26, 2021, 10:41 AM IST

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్​ను(Sushil kumar) దిల్లీలోని మండోలి జైలు నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు అతడితో సెల్ఫీలు తీసుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై మండిపడిన నెటిజన్లు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగింది?

రెండుసార్లు ఒలింపిక్(Olympics) పతక విజేత సుశీల్ కుమార్​ను మే 23న జరిగిన హత్య కేసులో భాగంగా అరెస్ట్ చేశారు. జూన్ 2 వరకు మండోలీ జైలులో ఇతడిని ఉంచారు. శుక్రవారం సుశీల్​ను తిహార్ జైలుకు తరలించారు. ఇక్కడ అధికారులకు అప్పగించిన తర్వాత సుశీల్​తో పోలీసులు సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు. సుశీల్​ కూడా నవ్వుతూ పోజిలిచ్చాడు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో పై అధికారులు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Enquiry ordered in matter of  selfie with Sushil
పోలీసులతో సుశీల్ కుమార్

ఇదేం కర్మరా బాబు!

భారత స్టార్ రెజ్లర్​, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్​ కుమార్​. తన విజయాలతో మువ్వెన్నల పతకాన్ని రెపరెపలాడించిన సుశీల్​.. హత్య కేసులో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చాలావరకు సాక్ష్యాలు అతడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో శిక్ష ఖాయమని అంతా అనుకుంటున్నారు. సుశీల్ మాత్రం అసలు ఏ తప్పు చేయలేదన్నట్లు ప్రవర్తించడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసులు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలోనూ నవ్వుతూ కనిపించడం పట్ల నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇదెక్కడి కర్మరా బాబు' అనుకుంటున్నారు.

ఇవీ చూడండి

Sushil Kumar: హత్య కేసులో కొత్త కోణం.. అమ్మాయే కారణమా?

ఒక్కొక్కటిగా బయటకు వస్తోన్న సుశీల్ నేరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.