ETV Bharat / sports

భారత బాక్సర్ల 'పసిడి' పంచ్​.. 14 పతకాలు కైవసం!

ఎల్డోరా కప్​ అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక(48కేజీలు), అల్ఫియా పఠాన్​(ప్లస్​ 81 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ఈ పోటీల్లో భారత్​కు రెండు స్వర్ణాలు రెండు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు దక్కాయి.

Indian Boxers Gold medal
భారత బాక్సర్ల పసిడి పంచ్
author img

By

Published : Jul 5, 2022, 9:03 AM IST

ఎల్డోరా బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్లు అల్ఫియా పఠాన్‌, గీతిక స్వర్ణాలతో మెరిశారు. 81 కేజీల ఫైనల్లో అల్ఫియా 5-0తో కంగిబయెవాను చిత్తు చేయగా.. 48 కేజీల తుది సమరంలో గీతిక 4-1తో సహచర బాక్సర్‌ కలైవాణిని ఓడించింది. 54 కేజీల విభాగంలో జమునకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ఆమె 0-5తో ఉక్సమోవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది.

మొత్తంగా ఈ టోర్నీని భారత్‌ 14 పతకాలతో (2 స్వర్ణ, 2 రజత, 10 కాంస్యాలు) ముగించింది. కుల్‌దీప్‌ కుమార్‌ (48 కేజీలు), అనంత చోప్డే (54 కేజీలు), సచిన్‌ (57 కేజీలు), జుగ్నూ (92 కేజీలు), జ్యోతి (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) సోనియా లాథర్‌ (57 కేజీలు), నీమా (63 కేజీలు), లలిత (70 కేజీలు), బబిత (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

ఇదీ చూడండి: మలేసియా మాస్టర్స్‌.. సింధు టైటిల్‌ సాధించేనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.