భారత స్టార్ అథ్లెట్ ద్యుతీ చంద్, క్రికెటర్ హర్భజన్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. వారిద్దరూ భారత ఆటగాళ్లకిచ్చే అత్యున్నత పురస్కారాల కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించింది. అర్జున కోసం ద్యుతీ, ఖేల్ రత్న కోసం హర్భజన్ పేర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి పంపాయి.
"గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారుల నామినేషన్లు పంపాయి అందుకే తిరస్కరించాం. ద్యుతీ చంద్ విషయంలో అయితే ఆలస్యంగా పంపడమే కాకుండా.. ర్యాంకింగ్స్ ప్రకారం పతకాలను చేర్చకపోవడం మరో కారణం. భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ)ను ఈ విషయంపై ప్రశ్నించాం. తర్వాత పంపిన జాబితాలోనూ ఆమెకు 5వ స్థానం కల్పించారు. అందుకే ఆమె నామినేషన్ తిరస్కరించాం"
-- జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్)
ఈ విషయంపై స్పందించిన ద్యుతీచంద్.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి మళ్లీ తన ఫైల్‌ను పంపాలని అభ్యర్థించినట్లు తెలిపింది.
-
Pull me down, I will come back stronger! pic.twitter.com/PHO86ZrExl
— Dutee Chand (@DuteeChand) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pull me down, I will come back stronger! pic.twitter.com/PHO86ZrExl
— Dutee Chand (@DuteeChand) July 9, 2019Pull me down, I will come back stronger! pic.twitter.com/PHO86ZrExl
— Dutee Chand (@DuteeChand) July 9, 2019
" నపోలీలోని వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో గెలిచిన బంగారు పతకాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు చూపించాను. నా ఫైల్ మళ్లీ పంపాలని అభ్యర్థించాను. మరోసారి నా నామినేషన్ పత్రాలను అర్జున అవార్డు కోసం పంపుతామని భరోసా ఇచ్చారు. తర్వాతి టోర్నీలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇంకా అర్జున అవార్డు విజేతలను ప్రకటించలేదు. నామినేషన్ ఆలస్యం కావడానికి ఎన్నికలు(లోక్‌సభ, విధానసభ), ఫొని తుఫానే కారణమని అనుకుంటున్నాను".
-- ద్యుతీ చంద్, భారత క్రీడాకారిణి
నపోలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో.. 100 మీటర్ల పరుగును 11.32 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది ద్యుతీ. ఇంతే దూరాన్ని 11.24 సెకన్లలో పూర్తిచేసిన జాతీయ రికార్డు ఆమె సొంతం. ఖేల్‌రత్న పురస్కారం కోసం క్రికెటర్ హర్భజన్ పేరును పంజాబ్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ రాష్ర విజ్ఞప్తినీ తోసిపుచ్చింది క్రీడా మంత్రిత్వ శాఖ.