ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ దిల్లీ కోర్టు బుధవారం తీర్పిచ్చింది. మే 4న దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. సుశీల్ దాడి చేయడం వల్లే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: