ETV Bharat / sports

స్ట్రాంజా బాక్సింగ్‌ సెమీస్‌లో దీపక్‌ సంచలనం - స్ట్రాంజా బాక్సింగ్‌ సెమీస్‌

స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్‌ దీపక్‌ కుమార్‌ సంచలనం సృష్టించాడు. సెమీస్‌లో అతను.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ జోరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)కు షాకిచ్చాడు. 4-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.

Deepak stuns Olympic champion to enter final

author img

By

Published : Feb 27, 2021, 7:04 AM IST

భారత బాక్సర్‌ దీపక్‌ కుమార్‌ సంచలన ప్రదర్శన చేశాడు. స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో పురుషుల 52 కేజీల సెమీస్‌లో అతను.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ జోరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)కు షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన దీపక్‌ 4-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.

మహిళల విభాగంలో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జ్యోతి గులియా (51 కేజీలు), భాగ్యవతి కచారి (75 కేజీలు) తమ బౌట్లలో ఓడిపోయారు. జ్యోతి 0-5తో పెరిజోక్‌ (రొమేనియా) చేతిలో, భాగ్యవతి కూడా అంతే తేడాతో గుర్గెన్‌ (అర్మేనియా) చేతిలో పరాజయం చెందారు. పురుషుల 91 కేజీల పైన విభాగంలో మంజీత్‌ సింగ్‌ ఓటమి పాలయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.