Common wealth games 75 years Gold medal: కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు నమోదైంది. స్కాట్లాండ్‌కు చెందిన జార్జ్ మిల్లర్ 'లాన్ బౌల్స్' మిక్స్‌డ్ పెయిర్‌లో బంగారు పతకం సాధించి, 75 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించాడు. 'లాన్ బౌల్స్' మిక్స్‌డ్ పెయిర్ ఫైనల్‌లో మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మెలానీ ఇన్నెస్, జార్జ్ మిల్లర్, రాబర్ట్ బార్, సారా జేన్ ఎవింగ్ (పారా మిక్స్‌డ్ పెయిర్స్ B2/B3) జట్టు 16-9 తేడాతో వేల్స్‌ను ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది.
ఈ ఈవెంట్‌లో స్కాట్లాండ్ జట్టు గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. అయితే, ఈ కామన్వెల్త్ క్రీడల్లోనే బుధవారం స్కాట్లాండ్‌కు చెందిన 72 ఏళ్ల రోజ్మేరీ లెంటన్ పారా లాన్ బౌల్స్ మహిళల విభాగంలో పసిడి నెగ్గి.. కామన్వెల్త్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన అతిపెద్ద వయసు గల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు అదే దేశానికి చెందిన జార్జ్ మిల్లర్ ఆమె రికార్డు బద్దలు కొట్టడం విశేషం.
ఇదీ చూడండి: 'అంపైర్ చీటింగ్'.. హాకీలో మహిళల జట్టు ఓటమి.. షూటౌట్లో తేలిన సెమీస్ ఫలితం