ETV Bharat / sports

'రెజ్లర్లను ప్రధాని కలవరా? నిందితుడిని ఎందుకు కాపాడుతున్నారు?'.. ప్రియాంక ఫైర్ - ప్రియాంక గాంధీ న్యూస్​

బ్రిజ్​ భూషణ్​కు వ్యతిరేకంగా సాగుతున్న జంతర్​ వద్ద సాగుతున్న రెజ్లర్ల నిరసనకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుగా నిలిచారు. శనివారం రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు.

riyanka gandhi at jantar mantar
priyanka gandhi at wrestlers protest
author img

By

Published : Apr 29, 2023, 9:34 AM IST

Updated : Apr 29, 2023, 12:54 PM IST

రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్​ బ్రిజ్​ భూషణ్​కు వ్యతిరేకంగా సాగుతున్న రెజ్లర్ల నిరసనకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శనివారం జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు. కర్నాటకలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రియాంక గాంధీ ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకుని రెజ్లర్లతో మాట్లాడారు. గతంలోనే రెజ్లర్లకు మద్దతు తెలిపిన ప్రియాంక.. తాజాగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంలో దోషులను రక్షించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

congress leader priyanka gandhi at jantar mantar
జంతర్​ మంతర్​ వద్ద ప్రియాంక

"నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ఏముందో ఎవరికీ తెలియదు. దాన్ని ఎందుకు చూపించడం లేదు? రెజ్లర్లు పతకాలు గెలిస్తే మాత్రం మనమందరం ట్వీట్లు చేసి గర్వంగా ఫీలవుతాం. కానీ ఇప్పుడు వారు న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు. మహిళా రెజ్లర్లందరూ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఆయన్ను (బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్) ప్రభుత్వం ఎందుకు కాపాడుతోందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ప్రధాన మంత్రి నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు. ఒకవేళ ఆయన ఈ రెజ్లర్ల గురించి ఆలోచించి ఉంటే.. వారితో ఎందుకు మాట్లాడలేదు.. వారిని ఇంకా ఎందుకు కలవలేదు. దేశం వారికి అండగా నిలుస్తోంది. ఇలాంటి సమస్యకు వ్యతిరేకంగా ఈ రెజ్లర్లు గళం విప్పినందుకు నేను చాలా గర్వపడుతున్నాను" అని ప్రియాంక అన్నారు.

priyanka gandhi at jantar mantar
రెజ్లర్లను ఓదారుస్తున్న ప్రియాంక

'నేను నిర్దోషిని, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను'
తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ గురించి రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్​ బ్రిజ్ భూషణ్ స్పందించారు. తనకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ కాపీ అందలేదని.. అది అందిన తర్వాతనే ఈ విషయంపై మాట్లాడతానని అన్నారు. అంతే కాకుండా విచారణను ఎదుర్కోవడంతో పాటు దర్యాప్తు సంస్థకు సహకరించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

"నాకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇంకా అందలేదు. ఎఫ్‌ఐఆర్ కాపీ అందిన తర్వాతనే నేను ఈ విషయంపై మాట్లాడతాను". నేను నిర్దోషిని, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. దర్యాప్తు సంస్థకు సహకరించేందుకు కూడా నేను సిద్ధమే. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అంతే కాకుండా నేను సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాను. ఈ సమయయంలో రాజీనామా చేయడం పెద్ద విషయం కాదు. కానీ నేను నేరస్థుడిని కాదు. నేను రాజీనామా చేస్తే వారి (మల్లయోధుల) ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుంది. నా పదవీకాలం దాదాపు ముగిసింది. ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక ఎన్నికల తర్వాత నా పదవీకాలం ముగుస్తుంది" అని అన్నారు.

జంతర్​ మంతర్​ వద్ద పవర్​ కట్​!
మరోవైపు రెజ్లర్ల దీక్ష శనివారంతో ఏడో రోజుకు చేరుకుంది. అయితే దిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద విద్యుత్, నీటి కనెక్షన్లను నిలిపివేశారు. నీరు, ఆహారం తీసుకురావడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదని మల్లయోధులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో కూర్చున్న రెజ్లర్లు మొబైల్‌ వెలుగులో భోజనం చేస్తున్నారు. అయితే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బజరంగ్ పునియా తెలిపారు. మరోవైపు పోలీసులు వారితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఇతర రెజ్లర్లు తెలిపారు. నిరసనలు తెలపాలంటే రోడ్డుపై పడుకోండి అంటున్నారని అన్నారు. దిల్లీలోని రెజ్లర్ వినేష్ ఫోగట్​తో పాటు ఇతర రెజ్లర్లు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారితో సంభాషించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీ ఒకటి రెజ్లర్లకు అందించారు. పోక్సో కింద నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని మాత్రం వారికి ఇవ్వలేదు.

Last Updated : Apr 29, 2023, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.