Hockey player proposes video: ఈ మధ్య కాలంలో మైదానంలోనే లవ్ ప్రపోజ్ సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా అబ్బాయిలు మోకాళ్లపై కూర్చొని అమ్మాయిలకు తమ ప్రేమను తెలియజేస్తుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ లవ్ ప్రపోజ్ సందర్భం మాత్రం ఇందుకు భిన్నం. దీంతో ఈ సంఘటన అందరీ చూపును వారివైపు తిప్పుకునేలా చేసింది. ఈ చూడముచ్చటి దృశ్యానికి మహిళల హాకీ ప్రపంచకప్ వేదికైంది.
తాజాగా పూల్-ఏ నెదర్లాండ్స్, చిలీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-1తో గెలిచింది. అయినా.. చిలె ప్లేయర్ ఫ్రాన్సిస్కా తాలా కొట్టిన గోలే ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఆమె గోల్‌కొట్టి తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసింది. అందరూ చూస్తుండగానే మైదానంలోనే మోకాలి మీద నిల్చొని ప్రపోజ్ చేసింది. అంతటితో ఆగకుండా ఆనందంలో అతడిని హత్తుకొని ముద్దాడుతూ.. ప్రేమ వర్షం కురిపించింది. దీంతో ఒక్కసారిగా కెమెరాలన్నీ వారివైపుకు తిరిగాయి. అందరీ కళ్లు వారిపైనే. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
-
"I made a bet with the girls that if I made a goal against the Netherlands, I had to marry my boyfriend."
— Watch.Hockey (@watchdothockey) July 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
"He said yes!" 💍
This interview with @chile_hockey's Francisca Tala is everything 🤣🙌 #HWC2022 pic.twitter.com/qVI0QcEhvC
">"I made a bet with the girls that if I made a goal against the Netherlands, I had to marry my boyfriend."
— Watch.Hockey (@watchdothockey) July 6, 2022
"He said yes!" 💍
This interview with @chile_hockey's Francisca Tala is everything 🤣🙌 #HWC2022 pic.twitter.com/qVI0QcEhvC"I made a bet with the girls that if I made a goal against the Netherlands, I had to marry my boyfriend."
— Watch.Hockey (@watchdothockey) July 6, 2022
"He said yes!" 💍
This interview with @chile_hockey's Francisca Tala is everything 🤣🙌 #HWC2022 pic.twitter.com/qVI0QcEhvC
మ్యాచ్ అనంతరం ఫ్రాన్సిస్కా మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో తాను నెదర్లాండ్స్‌పై గోల్ కొడితే తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటానని ముందే తన జట్టు సభ్యులతో బెట్ కాసిందని చెప్పింది. ఆమె చెప్పినట్లే గోల్ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలుత నెదర్లాండ్స్ ఒక గోల్ చేయగా తర్వాత చిలే వెనుకబడిపోయింది. అయితే, అనూహ్యంగా ఫ్రాన్సిస్కా గోల్ చేసి తన జట్టులో ఉత్సాహం నింపింది. అయినా చివరికి ఆ జట్టు మ్యాచ్ ఓడిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం గ్యాలరీలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలవడంతో అతడు మైదానంలోకి దూకి వచ్చాడు. దీంతో అతడు తన ప్రేయసిని మోకాలిపై నిల్చొని ప్రపోజ్ చేయమని అడగ్గానే ఆమె అలాగే చేసింది. తర్వాత వెంటనే ఇద్దరూ హత్తుకొని ముద్దాడుకున్నారు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. కోహ్లి మీదే కళ్లన్నీ.. లేదంటే ఇక కష్టమే!