ETV Bharat / sports

Chess Grandmaster Rithvik met KTR : 'రాజారిత్విక్ ప్రపంచ ఛాంపియన్​గా ఎదగాలి' - భారత 70వ చెస్ గ్రాండ్​మాస్టర్

భారత చదరంగంలో అవతరించిన మరో గ్రాండ్​మాస్టర్ రాజా రిత్విక్(Chess Grandmaster Raja Rithvik).. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్​(Telangana IT minister)ను కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ప్రగతి భవన్​కు వెళ్లిన రిత్విక్​కు ప్రభుత్వపరంగా చేయూతనిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రిత్విక్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు.

Chess Grandmaster Rithvik met KTR
Chess Grandmaster Rithvik met KTR
author img

By

Published : Nov 14, 2021, 10:07 AM IST

చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ రాజారిత్విక్‌(Chess Grandmaster Rithvik met KTR) ప్రపంచ ఛాంపియన్‌(world champion)గా ఎదగాలని, రాష్ట్రానికి దేశానికి ఖ్యాతి తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు(Telangana IT minister KTR) ఆకాంక్షించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ చేయూతనిస్తామన్నారు. ఇటీవల గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన తెలంగాణ యువకుడు రిత్విక్‌ శనివారం తన తల్లిదండ్రులతో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌(chess grandmaster Rithvik met KTR)ను కలిశారు. ఆయనను మంత్రి అభినందిస్తూ, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. రిత్విక్‌, ఆయన తల్లిదండ్రులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రాజారిత్విక్ ప్రపంచ ఛాంపియన్​గా ఎదగాలి
రాజారిత్విక్ ప్రపంచ ఛాంపియన్​గా ఎదగాలి

రిత్విక్‌(chess grandmaster Rithvik) ఆరేళ్ల వయసులో తన తండ్రి చదరంగం ఆడుతుంటే చూసి తొలి చూపులోనే ఆ 64 గళ్లపై ప్రేమ పెంచుకున్నాడు. వేసవి శిక్షణ శిబిరంలో చదరంగం(chess)లో శిక్షణ ఇప్పిస్తే సత్తా చాటాడు. అప్పటి నుంచే చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన రిత్విక్‌ కుటుంబంతో వరంగల్‌లో స్థిరపడగా.. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చాడు. కోచ్‌ రామరాజు దగ్గర చేరి ఆటలో మరింత పట్టు సాధించాడు.

"గ్రాండ్‌మాస్టర్‌ కలను నిజం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. జులైలో అమ్మతో కలిసి ఐరోపా వచ్చా. రెండు జీఎం నార్మ్‌లతో పాటు ఎలో రేటింగ్‌ పెంచుకుని అనుకున్నది సాధించా. 2600 ఎలో రేటింగ్‌తో ఎలైట్‌ క్లబ్‌లో చేరడంతో పాటు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే నా తదుపరి లక్ష్యం"

- రిత్విక్‌, చెస్ గ్రాండ్​మాస్టర్

5 స్వర్ణాలు..

13 ఏళ్ల వయసులోనే అండర్‌-13(under 13)తో పాటు ఏకంగా అండర్‌-17 జాతీయ టైటిళ్లు(national champion) సాధించాడు. 2018లో ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం అయిదు స్వర్ణాలు(rithvik won 5 gold medals) సాధించాడు. రిత్విక్‌ చెస్‌ కెరీర్‌ కోసం తల్లి దీపిక తన లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదిలేసింది. 14 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌(international star Rithvik) హోదా దక్కించుకున్న రిత్విక్‌.. ఇంకా ముందుగానే జీఎం కావాల్సింది.

20 రోజుల వ్యవధిలో 2500 ఎలో రేటింగ్..

కానీ కరోనా కారణంగా అతనికి ఎదురు చూపులు తప్పలేదు. వైరస్‌ తగ్గుముఖం పట్టగానే గ్రాండ్‌మాస్టర్‌(chess grandmaster Rithvik) హోదా సాధించాకే తిరిగి భారత్‌కు రావాలనే ఉద్దేశంతో ఐరోపా వెళ్లాడు. అక్కడే వరుసగా టోర్నీల్లో పాల్గొంటూ కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొని 20 రోజుల వ్యవధిలోనే మిగతా రెండు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్‌(yellow rating)ను అందుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.