ETV Bharat / sports

Charleston Open: ఫైనల్​లో సానియా మీర్జా జోడీకి నిరాశ - మహిళల డబుల్స్​లో సానియా ఓటమి

Charleston Open Sania mirza: చార్ల్స్​టన్​ ఓపెన్​ డబ్ల్యూటీఏ ఫైనల్​లో భారత్​ టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన హోరాహోరీ పోరులో పోలాండ్​కు చెందిన నాలుగో సీడ్​ మాగ్దా లినెట్​ ద్వయం చేతిలో ఓటమిపాలైంది.

Charleston Open
సానియా మీర్జా
author img

By

Published : Apr 11, 2022, 11:25 AM IST

Sania mirza Sania mirza: అమెరికాలో జరిగిన చార్ల్స్​టన్​ ఓపెన్​ డబ్ల్యూటీఏ టెన్నిస్​ టోర్నీ మహిళల డబుల్స్​లో సానియా మీర్జా జోడీకి నిరాశే ఎదురైంది. ఫైనల్​లో సానియా(భారత్​)-లూసీ హర్డెకా(చెక్​ రిపబ్లిక్​) జోడీ సూపర్​ ట్రైబ్రేక్​లో నాలుగో సీడ్​ మాగ్దా లినెట్​(పొలాండ్​)- ఆండ్రేజా క్లెపాచ్​(స్లొవేనియా) ద్వయం చేతిలో ఓడిపోయి రన్నరప్​గా నిలిచింది. దీంతో ఓడిపోయిన ఈ జోడీకి సుమారు 26వేల డాలర్లు ప్రైజ్​మనీ లభించనుంది.

డబ్ల్యూటీఏ 500 ఈవెంట్​ ఫైనల్​ సుమారు 2 గంటల 35 నిమిషాల పాటు సాగింది. హోరాహోరీ పోరులో 6-2, 4-6, 10-7 పాయింట్ల తేడాతో సానియా మిర్జా ద్వయం పరాజయం పాలైంది. అంతకు ముందు సెమీఫైనల్​లో టాప్​ సీడ్​ జాంగ్​ షూయ్​-కారోలిన్​ డెలెహైడ్​ జోడీపై 2-6, 6-4,8-10 పాయింట్లతో ఫైనల్​కు దూసుకెళ్లింది. కాగా, సుదీర్ఘ ప్రయాణం తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సానియా ఇటీవలే ప్రకటించింది. తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్‌ అని.. 2022 చివరి నాటికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: కెరీర్​పై సానియా మీర్జా కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.