చెస్ క్రీడాకారుల కెరీర్ ప్రస్తుత కాలంలో చాలా తక్కువగా ఉంటోంది దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. కాలంతో పాటు ప్లేయర్లకు శారీరక ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ 'డీఆర్ఎస్ విత్ యాష్' యూట్యూబ్ ఎపిసోడ్లో మాట్లాడుతూ ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"గతంతో పోలిస్తే ఇప్పుడు చెస్ క్రీడాకారులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నారు. దీంతో వారి కెరీర్ చాలా తక్కువ ఏళ్లే ఉంటోంది" అని ఆనంద్ వెల్లడించారు.
చెస్‌ను చాలామంది కెరీర్‌గా ఎంచుకోవడానికి దిగ్గజ ప్లేయర్ బాబీ ఫిషర్ ప్రధాన కారణమని ఆనంద్ తెలిపాడు. 1970,80ల్లో మన దేశంలో ఈ ఆట అసలు కెరీర్‌గా ఎవరూ ఎంచుకునేవారు కాదని అన్నారు. అయితే చెస్ వల్ల తనకు ఏకగ్రాత, జ్ఞాపకశక్తి పెరిగాయని చెప్పాడు. 2017లో వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో తాను గెలుస్తానని ఎవరూ ఊహించలేదని ఆనంద్ పేర్కొన్నారు. అంతెందుకు తాను ఇందులో విజేతగా నిలుస్తానని అనుకోలేదని స్పష్టం చేశారు.