ETV Bharat / sports

అమెరికా బౌట్​కు విజేందర్ దూరం- గాయమే కారణం

ఏప్రిల్​లో బాక్సర్​ విజేందర్​ ఆటను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. అమెరికాలో జరిగే బౌట్​కు గాయం కారణంగా హాజరుకావట్లేదని ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడీ హరియాణా బాక్సర్​.

గాయంతో బౌట్​కు దూరమైన బాక్సర్​ విజేందర్​
author img

By

Published : Mar 26, 2019, 11:01 AM IST

భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అమెరికా గడ్డపై కాస్త ఆలస్యంగా అడుగు పెట్టనున్నాడు. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్​ 12న విజేందర్​​ బౌట్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎడమ కంటికి గాయం అయింది. అందుకే మ్యాచ్​లో ఆడలేకపోతున్నట్టు వెల్లడించాడు.

boxer vijendar singh in american bout
అద్దంలో తీసుకున్న ఫోటోను షేర్​ చేసిన బాక్సర్​ విజేందర్​

' నా అభిమానులకు చేదు కబురు. స్పారింగ్​ సెషన్​(ప్రాక్టీస్ )లో నా ఎడమ కంటికి గాయమైంది. ఆరు కుట్లు వేశారు. అందుకే ఏప్రిల్​ 12న అమెరికాలోని లాస్​ఏంజెల్స్​లో జరగాల్సిన మ్యాచ్​లో ఆడలేకపోతున్నాను.'
-- విజేందర్​, భారత బాక్సర్​

2015లో ప్రొఫెషనల్‌ బాక్సర్​ అవతారమెత్తిన విజేందర్‌ ఇప్పటివరకు 10 బౌట్‌లలో పోటీపడి అన్నింట్లోనూ విజయం సాధించాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.