ETV Bharat / sports

మేరీకోమ్​తో వివాదంపై యువ బాక్సర్ నిఖత్ స్పందన​ - నిఖత్​ బాక్సింగ్​ కెరీర్​ విశేషాలు

తెలంగాణ యువ బాక్సర్​ నిఖత్​ జరీనా.. దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​తో జరిగిన వివాదంపై స్పందించింది. దీనితో పాటే తన కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను 'ఈటీవీ-భారత్'​ ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Nikhat Zareen
నిఖత్​
author img

By

Published : Jun 3, 2020, 3:31 PM IST

Updated : Jun 3, 2020, 3:37 PM IST

మేరికోమ్​తో వివాదంపై స్పందించిన నిఖత్​

ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో పాల్గొనే అవకాశం కోసం హైదరబాదీ యువ బాక్సర్​ నిఖత్​ జరీన్.. స్టార్​ బాక్సర్​ మేరీకోమ్​ మధ్య గతేడాది గట్టి వివాదమే జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీరిద్దరి మధ్య సెలక్షన్​ ట్రయల్స్​ను​ నిర్వహించింది భారత బాక్సింగ్​ సమాఖ్య. ఇందులో మేరీకోమ్​ విజేతగా నిలిచి ఒలింపిక్స్​ బెర్త్​ ఖరారు చేసుకుంది. అయితే ఇదే విషయంతో పాటు పలు ఆసక్తికర విషయాలను 'ఈటీవీ భారత్'తో జరిగిన ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూలో నిఖత్ పంచుకుంది.

ఒలింపిక్స్​​కు మేరీకోమ్ అర్హత సాధించడంపై మీ అభిప్రాయం?​

టోక్యో ఒలింపిక్స్​కు మేరీకోమ్​ అర్హత సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తాను బంగారు పతకాన్ని సాధించాలని ఆశిస్తున్నా. తనపై నాకు ఎలాంటి కోపం లేదు.

'ఈద్'​ పండుగ ఎలా చేసుకున్నారు?

ఈ కరోనా​ అందరికీ శాపంలా మారితే, నాకు మాత్రం కొంతవరకు ఊరటనిచ్చింది. గత నాలుగేళ్ల నుంచి క్రీడా ఈవెంట్లు కారణంగా నా కుటంబంతో కలిసి ఈ పండుగను జరుపుకోలేకపోయాను. లాక్​డౌన్​ వల్ల ఈ ఏడాది వారితో కలిసి పండుగ వాతావరణాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదించాను.

మీరు ఏ విషయాలను ఎక్కువగా ఇష్టపడతారు?

ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి కసరత్తులు, బాక్సింగ్​ శిక్షణ, నమాజ్​ చేయడం ఎంతో ఇష్టం. ముఖ్యంగా షయారీ(కవితలు) అంటే చాలా ఇష్టం.

బాక్సర్​ ఎందుకు కావాలనుకున్నారు?

అథ్లెట్​గా కెరీర్​ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన వల్ల బాక్సింగ్​లోకి అడుగుపెట్టాను. ఓ రోజు నాన్నతో కలిసి నిజమాబాద్​లోని ఓ మైదానం వద్దకు వెళ్లాను. అక్కడ అనేక మంది అబ్బాయిలు బాక్సింగ్​ చేస్తూ కనిపించారు. కానీ అక్కడ ఒక్క అమ్మాయి అయినా కనిపించలేదు. దీంతో నాకు బాక్సర్​ కావాలనిపించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే నాన్నకు చెప్పాను. మగవారిలా శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉండవని ఆయన నాతో అన్నారు. దీంతో ఎలాగైనా ఓ బలమైన మహిళా బాక్సర్​గా ఎదగాలని దృఢంగా నిశ్చయించుకున్నా. అలా 2009లో తొలిసారిగా బాక్సింగ్​లోకి అడుగుపెట్టా. ​

ప్రస్తుతం ఈ లాక్​డౌన్​ సమయంలో ఇంట్లోనే ఉంటూ, ఫిట్​నెస్ సహా బాక్సింగ్​ శిక్షణపై దృష్టి సారించినట్లు తెలిపింది నిఖత్​. కరోనా వల్ల ఈ ఏడాది టోర్నీలు జరగకపోవచ్చని అభిప్రాయపడింది​. 2021, 2022లో జరగబోయే కామన్వెల్త్ క్రీడల కోసం సాధన చేస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి : కరోనా తర్వాత మళ్లీ ట్రాక్​పైకి రయ్​.. రయ్​..

Last Updated : Jun 3, 2020, 3:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.