అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్న తెలంగాణ ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు నగదు ప్రోత్సాహం అందిచింది ప్రభుత్వం. దీన్ని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా.. హైదారాబాద్‌లోని తన నివాసంలో అందుకుంది.
న్యాట్కో ఫార్మా కంపెనీ తమ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బాక్సింగ్ కోచింగ్ కోసం కేటాయించిన 5 లక్షల రూపాయలను చెక్కును నిఖత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యుడు అల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, నిఖత్ జరీన్ తండ్రి జమిల్ పాల్గొన్నారు.
ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ బాక్సర్.. తనకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతోంది.
ఇది చూడండి : పతకం కోసం పోరుబాట.. ఉద్యోగం కోసం వెతుకులాట