ETV Bharat / sports

కరోనా బాధితుల వైద్యం కోసం బిల్డింగ్ ఇచ్చిన ఆమిర్ - boxing news

కరోనా బాధితులకు వైద్యం అందించడం కోసం, తన భవంతిని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ప్రముఖ బాక్సర్ ఆమిర్​ఖాన్. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

కరోనా బాధితుల వైద్యం కోసం బిల్డింగ్ ఇచ్చిన ఆమిర్
బాక్సర్ ఆమిర్​ఖాన్
author img

By

Published : Mar 26, 2020, 5:40 PM IST

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సెలబ్రిటీలు, క్రీడాకారులు, అథ్లెట్లు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. కొందరు డబ్బులను విరాళమిస్తుండగా, యూకే బాక్సర్ ఆమిర్​ఖాన్ ఏకంగా తన నాలుగు అంతస్తుల భవంతి ఇవ్వాలని నిర్ణయించాడు. అందులో వైద్యం అందించేందుకు అనువుగా ఉంటుందని చెబుతూ ట్వీట్ చేశాడు.

uk boxer aamir khan tweet
యూకే బాక్సర్ ఆమిర్​ఖాన్ ట్వీట్

"వైరస్​ వ్యాపిస్తున్న ఈ సమయంలో ఆసుపత్రిల్లో మంచం దొరకడం కష్టమైపోతుంది. 60 వేల చదరపు అడుగులు ఉన్న నాలుగు అంతస్తుల నా భవంతిని, నేషనల్ హెల్త్ సర్వీస్​(ఎన్​హెచ్​ఎస్)కు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇందులో పెళ్లి మండపం, రిటైల్ ఔట్​లెట్ ఉన్నాయి" -ట్విట్టర్​లో బాక్సర్ ఆమిర్ ఖాన్

లైట్ వెల్టర్​ వెయిట్​ విభాగంలో ఆమిర్​ ఖాన్ మాజీ ఛాంపియన్​. 2009 నుంచి 2012 వరకు ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్​ విజేతగా ఉన్నాడు.

అంతకు ముందు యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు, మూడు వారాల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.