బక్సమ్ అంతర్జాతీయ టోర్నమెంట్లో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకుపోయిన భారత బాక్సర్ మనీశ్ కౌశిక్ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 63కిలోల విభాగంలో రింగ్‌లోకి దిగిన మనీశ్.. 3-2తో డెన్మార్క్‌కు చెందిన నికోలాయ్ టెర్టేరియన్ను మట్టికరిపించాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన కౌశిక్.. ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్ తర్వాత తొలిసారి బరిలోకి దిగాడు.
అయితే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత వికాస్ క్రిషన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. 69కిలోల విభాగంలో స్పెయిన్‌కు చెందిన సిసోఖోపై 4-1తో విజయం సాధించాడు.
ఇదీ చూడండి: కోహ్లీసేనకు 'ధర్మ సంకటం'- రాహుల్‌కు చోటెక్కడ?