రాజస్థాన్‌కు చెందిన అథ్లెట్ భావ్నా జాట్ సరికొత్త రికార్డు సాధించింది. శనివారం రాంచీ వేదికగా జరిగిన 7వ జాతీయ రేస్‌వాక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఈ క్రీడాకారిణి... 20 కిలోమీటర్ల రేసు తక్కువ సమయంలో పూర్తిచేసింది. ఇందుకు ఒక గంట 29 నిమిషాల 54 సెకన్ల(1:29:54) సమయాన్ని మాత్రమే తీసుకుంది. ఫలితంగా సరాసరి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ఘనత అందుకున్న మొదటి భారతీయ మహిళగా పేరు తెచ్చుకుంది.
భారతీయ క్రీడాకారుల సమాఖ్య ప్రకారం.. 20 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 31 నిమిషాలల్లో(1:31:00) పూర్తిచేయాలి. నిర్ణీత సమయం కంటే ముందుగా గమ్యం చేరుకోవడం వల్ల భావ్నా టోక్యో ఒలింపిక్స్‌కు బెర్త్ సంపాదించుకుంది.
9 నిమిషాల కంటే ముందుగా..
గతేడాది జరిగిన పోటీలో 20 కి.మీ.ల దూరాన్ని చేరటానికి ఒక గంట 38 నిమిషాల సమయం తీసుకుంది భావ్నా. తాజాగా జరిగిన ఈవెంట్లో 9 నిమిషాల కంటే ముందుగానే గమ్యాన్ని చేరింది. వచ్చే నెలలో ఆసియా రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొననుంది.
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో రేస్ వాకర్‌గా భావ్నా అర్హత సాధించింది. ఇప్పటికే పురుష రేస్‌వాకర్ కెటీ ఇర్ఫాన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో పురుష రేస్‌వాకర్ మనీష్ రావత్... నిమిషం వ్యవధిలో పతకాన్ని కోల్పోయాడు.
ఇదీ చూడండి.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరిన భారత్