ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు సెప్టెంబర్-అక్టోబర్‌లో రష్యాలో జరగనున్నాయి. భారత్ తరఫున బాక్సింగ్ పోటీలకు మేరీకోమ్‌ను ఎంపిక చేయటంపై మరో బాక్సర్ నిఖత్ జరీన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి పరీక్ష లేకుండా ఆమెను ఎలా ఎంపిక చేస్తారని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బిఎఫ్‌ఐ)కు లేఖ రాసింది. అవకాశమున్నా తనకు పోటీ చేసే అర్హత లేకుండా చేశారని ఆరోపించింది. స్పందించిన మేరీకోమ్.. ఈ పోటీలకు తన ఎంపిక సరైనదేనని, ప్రతిభ ఉన్నవాళ్లకు పరీక్షలు అవసరం లేదని జవాబిచ్చింది.
"సెలక్టర్లు అన్ని విధాలా పరిశీలించే ఎంపిక చేస్తారు. సరైన ప్రదర్శన చూపితే ఎలాంటి ట్రయల్ అవసరం లేదు. వారు ఏ ఛాంపియన్షిప్కైనా, టోర్నీకైనా అర్హులే. బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో ట్రయల్ ఇవ్వటం ఎప్పుడైనా చూశారా? సైనా, సింధు ఎప్పడైనా ట్రయల్ ఇచ్చారా? అది ఇవ్వటం, ఇవ్వకపోవటం నా చేతిలో లేదు. ఆ విషయాన్ని బిఎఫ్‌ఐ నిర్ణయిస్తుంది." -మేరీకోమ్, బాక్సర్
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ.. ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాలు గెలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో గువహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో జరీన్‌ను ఓడించి కాంస్యం గెలిచింది మేరీ.
ఇది చదవండి: జాతీయ క్రీడా పురస్కారాల కోసం కమిటీ సిద్ధం