ప్రపంచ బాక్సింగ్ రజత పతక విజేత, టాప్‌సీడ్ అమిత్ పంఘల్, అగ్రశ్రేణి బాక్సర్ వికాస్ కృష్ణన్‌లకు అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు (2020)కు వీరి పేర్లను సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ సమాఖ్య.
అర్జున అవార్డులకు లవ్లీనా (69 కిలోలు), సిమ్రన్‌జీత్ కౌర్(64 కిలోలు), మనీష్ కౌషిక్(63 కిలోలు)ల పేర్లను కేంద్రానికి పంపింది. వీరిలో లవ్లీనా.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని రెండు సార్లు గెలిచింది.
జాతీయ మహిళా బాక్సింగ్ కోచ్ మహ్మద్ అలీ కమార్, అసిస్టెంట్ కోచ్ ఛోటే లాల్ యాదవ్ పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేసింది. గత నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా వీరి పేర్లను కేంద్రానికి పంపినట్లు బీఎఫ్ఐ తెలిపింది. అలాగే ధ్యాన్‌చంద్ పురస్కారం కోసం ఎన్.ఉష్ను నామినేట్ చేసింది.
ఇది చూడండి : క్రీడల్లో అత్యున్నత పురస్కారానికి రోహిత్‌శర్మ నామినేట్