శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత్ జట్టు సారథిగా హార్దిక్ పాండ్యను బీసీసీఐ ప్రకటించింది. 360 డిగ్రీల ఆటగాడు సూర్య కుమార్ యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. సొంత గడ్డపై ఆడే ఈ సిరీస్‌కు జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను జట్టులోకి బోర్టు తీసుకోలేదు. కాగా, రిషబ్ పంత్‌కు జట్టులో స్థానం లభించలేదు.
పాత కమిటీ.. చివరి సెలెక్షన్..
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ చివరిసారిగా జట్టు ఎంపికలో పాల్గొంది. కాగా, గాయం కారణంగా రోహిత్ శర్మ అందుబాటులో లేడు. అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు రెస్ట్ తీసుకోలేదు. దీంతో ఈ సిరీస్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చారు. ఇక కేఎల్ రాహుల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అందుబాటులో లేడు. అలాగే గాయం నుంచి కోలుకున్న సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వన్డే సిరీస్ నాటికి జట్టుతో చేరతారని అనుకున్నా.. అది కుదరలేదు.
శ్రీలంక సిరీస్‌లో భారత టీ20 జట్టు :