భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దాతృత్వం చాటుకున్నాడు. తన ఆరు నెలల జీతాన్ని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విరాళమిస్తున్నట్లు చెప్పాడు. వెంటనే ఇతడిపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు. ఈ ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు భజరంగ్.
-
एक प्रशंसनीय कार्य @BajrangPunia 🙏 https://t.co/VUg7pgVzGZ
— Kiren Rijiju (@KirenRijiju) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">एक प्रशंसनीय कार्य @BajrangPunia 🙏 https://t.co/VUg7pgVzGZ
— Kiren Rijiju (@KirenRijiju) March 23, 2020एक प्रशंसनीय कार्य @BajrangPunia 🙏 https://t.co/VUg7pgVzGZ
— Kiren Rijiju (@KirenRijiju) March 23, 2020
"ఒలింపిక్స్ కంటే ముందు కరోనాపై మనం పోరాడాలి. ఒకవేళ పరిస్థితి అదుపులోకి రాకపోతే 2-3 నెలలు ఇలానే చేయాల్సి ఉంటుంది. చాలా దేశాలు తమ అథ్లెట్లను ఒలింపిక్స్‌కు పంపకపోవచ్చు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తప్పుకున్నాయి. దీనిని బట్టే చూస్తే మెగా క్రీడల్ని వాయిదా వేయడమే మంచిది" -భజరంగ్ పూనియా, భారత రెజ్లర్
25 ఏళ్ల భజరంగ్.. ఒలింపిక్స్‌లో పతకం సాధించగల రెజ్లర్. గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని గెల్చుకున్నాడు. ప్రస్తుతం రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఒలింపిక్స్‌కు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై భారత ఒలింపిక్ అసోసియేషన్ చర్చలు జరుపుతోంది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై మాత్రం ఈ క్రీడల్ని వాయిదా వేయాలని, రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది.