ETV Bharat / sports

'తిబిలిసి గ్రాండ్​ ప్రీ'లో భజరంగ్​ భళా

భారత్  రెజ్లర్ భజరంగ్​ పునియా అంతర్జాతీయ టోర్నీలో మరోసారి భళా అనిపించాడు. జార్జియాలో జరుగుతున్న తిబిలిసి గ్రాండ్ ప్రీ టోర్నీ ఫైనల్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. ఫలితంగా ఈ ఏడాది మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

భజరంగ్ పునియా
author img

By

Published : Aug 10, 2019, 11:00 AM IST

భారత స్టార్​ రెజ్లర్​ భజరంగ్​ పునియా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. జార్జియా వేదికగా జరుగుతున్న 'తిబిలిసి గ్రాండ్​ ప్రీ' టోర్నీలో విజేతగా నిలిచి... ఈ ఏడాది నాలుగో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన​ ఫైనల్లో ప్రత్యర్థి పిమన్​ బిబ్యాని(ఇరాన్​)ను ఓడించి ఈ ఘనత సాధించాడు. 65 కేజీల పురుషుల ఫ్రీ స్టయిల్​ విభాగంలో పాల్గొన్న భారత ఆటగాడు... బిబ్యానిపై 2-0 తేడాతో గెలిచాడు.

ఈ ఏడాది కొలోవ్‌ నికోలా ప్రెటోవ్‌ టోర్నీ , ఆసియా ఛాంపియన్‌షిప్‌, అలీ అలియెవ్‌ టోర్నీలో స్వర్ణాలు సాధించాడు భజరంగ్​.

త్వరలో ఈ రంగానికే చెందిన సంగీత ఫొగాట్​ను వివాహమాడనున్నాడీ డిఫెండింగ్​ ఛాంపియన్. 2020 టోక్యో ఒలింపిక్స్ అనంతరం వీరిద్దరి పెళ్లి జరగనుంది.

ఇదీ చూడండి: వివాహబంధంతో ఒక్కటి కానున్న మల్లయోధులు

Gurugram (Haryana), Aug 9(ANI): A leopard ventured into a residential area in Gurugram's Badhsahpur. It entered a salon and salon owner closed the shutters capturing it inside. Forest Department placed trap outside the shutters and rescued it.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.