badminton rankings 2022: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్‌తో మెరిసిన స్టార్ షట్లర్ లక్ష్యసేన్... ర్యాంకింగ్స్‌లో జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా టాప్-10 లోకి దూసుకెళ్లాడు. ఈ 20 ఏళ్ల యువకెరటం.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని.. 74,786 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. సింగపూర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూను వెనక్కి నెట్టాడు. మరో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 12వ స్థానానికి పడిపోయాడు.
మహిళల డబుల్స్‌లో జోరు కనబర్చిన గాయత్రీ గోపీచంద్- త్రీసా జాలీ జోడి.. ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు మెరుగైంది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓటమిపాలైన ఈ జంట.. ప్రస్తుతం 34వ స్థానంలో ఉంది. ఈ జోడీకి ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ కావడం విశేషం. అశ్వినీ పొన్నప్ప, ఎన్ సిక్కీ రెడ్డి జోడీ 20వ స్థానంలో ఉంది.
మరోవైపు, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. సైనా నెహ్వాల్ రెండు ర్యాంకులు మెరుగై.. 23వ స్థానానికి చేరుకుంది. గత జనవరిలో ఇండియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్‌సాయి రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగై.. ఏడో ర్యాంకుకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్లోకి..