Australian Open Nadal prize money: సుమారు రెండు వారాల పాటు సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మెగా ఈవెంట్ ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌తో పూర్తయింది. స్పానిష్ ఆటగాడు, ఆరో సీడ్ రఫెల్ నాదల్ రికార్డు స్థాయిలో 21వ సారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాడు.
ఫైనల్లో తొలి రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించిన రష్యా ఆటగాడు, రెండో సీడ్ మెద్వెదెవ్.. తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి చివరికి 2-6, 6-7 (5-7), 6-4, 6-4, 7-5 తేడాతో రన్నరప్‌గా నిలిచాడు. కాగా, వీరిద్దరికీ ఎంత మొత్తంలో నగదు బహుమతి లభించిందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. విజేతగా నిలిచిన నాదల్‌కు 2,875,000 ఆస్ట్రేలియా డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఇది భారత కరెన్సీలో రూ.15 కోట్లపైమాటే. అలాగే మెద్వెదెవ్‌కు 1,575,000 డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఇది రూ.8 కోట్లపైనే.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
'క్లే కోర్టు' కింగ్ రఫెల్ నాదల్.. 21 ఏళ్లు.. 21 గ్రాండ్‌స్లామ్‌లతో రికార్డు