ETV Bharat / sports

బోపన్న జోడీ ఓటమి.. తొలి రౌండ్​లోనే సానియా మీర్జా జంట ఔట్ - ఆస్ట్రేలియన్ ఓపెన్ బోపన్న జోడీ

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్​లో భారత టెన్నిస్​ ఆటగాళ్లు నిరాశపరిచారు. పురుషుల డబుల్స్​ ఓపెనింగ్​ రౌండ్​లో బోపన్న జోడీ ఓడిపోగా.. మహిళల డబుల్స్​లో సానియా మీర్జా జంట ఓటమి పాలైంది.

bopanna, sania mirza
బోపన్న, సానియా మీర్జా
author img

By

Published : Jan 19, 2022, 1:17 PM IST

Updated : Jan 19, 2022, 1:58 PM IST

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్​లో భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఓపెనింగ్​ రౌండ్​లోనే ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్​ ఈవెంట్​లో భారత టెన్నిస్ స్టార్ బోపన్న, ఫ్రాన్స్​కు చెందిన రోజర్ వసెలిన్(Edouard roger- vasselin) జోడీ తొలి రౌండ్​లోనే ఓటమి చవిచూసింది. ఫిలిప్పైన్స్​కు చెందిన ట్రీట్ హువే, ఇండోనేసియా ఆటగాడు క్రిస్టోఫర్ రంగ్​కాట్ జంట చేతిలో 3-6, 7-6(2), 6-2 తేడాతో పరాభవం చెందింది.

ఓటమి బాటలో సానియా..

మహిళల డబుల్స్​ ఈవెంట్​లో భారత్​కు చెందిన సానియా మీర్జా, ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్ జంట ఓపెనింగ్​ రౌండ్​లోనే ఓడిపోయింది. స్లొవేనియాకు చెందిన కాజా జువన్, తమర జిడన్​సెక్​ జంట చేతిలో 6-4, 7-6 తేడాతో ఓటమి చవిచూసింది.

nadal
నాదల్

మూడో రౌండ్​లోకి నాదల్..

స్పెయిన్ టెన్నిస్ స్టార్​ రఫెల్ నాదల్ మూడో రౌండ్​లోకి దూసుకెళ్లాడు. జర్మనీకి చెందిన యాన్నిక్ హాన్ఫ్​మన్​ను 6-2, 6-3, 6-4 తేడాతో ఓడించాడు.

ఇదీ చదవండి:

మొదలెట్టిన మెద్వెదెవ్.. ముర్రే, సబలెంక శుభారంభం

Last Updated : Jan 19, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.