ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 'సింగిల్స్‌'లో భారత్‌కు దక్కని చోటు - ఆస్ట్రేలియా ఓపెన్ 2022

Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్​ సింగ్సిల్స్ విభాగంలో భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు. భారత ఆటగాడు యుకీ బాంబ్రి కూడా రెండో క్వాలిఫయర్స్​లో ఓటమిపాలయ్యాడు.

australia open
ఆస్ట్రేలియా ఓపెన్
author img

By

Published : Jan 13, 2022, 10:39 PM IST

Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సారి సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఎవరూ అర్హత సాధించలేకపోయారు. టీమ్‌ఇండియా ఆటగాడు యుకీ బాంబ్రి తన రెండో రౌండ్‌ క్వాలిఫయిర్స్‌ మ్యాచ్‌లో 1-6, 3-6 తేడాతో టామస్‌ మచాక్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్‌కు ఉన్న చివరి ఆశలు ఆవిరయ్యాయి. చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు టామస్ ఆది నుంచే యుకీపై ఆధిక్యత ప్రదర్శించాడు. అయితే రెండో సెట్‌లో యుకీ కాస్త ప్రతిఘటించాడు. కానీ ఆఖరికి విజయం టామస్‌నే వరించింది.

రెండు రోజుల కిందట తొలి రౌండ్‌లో పోర్చుగీస్ ఆటగాడు డొమింగూస్‌పై 6-4, 6-2 తేడాతో సులువుగా గెలిచిన యుకీ కీలకమైన రెండో రౌండ్‌లో మాత్రం తేలిపోయాడు. మహిళల సింగిల్స్‌ క్రీడాకారిణి అంకితా రైనా కూడా ఓడిపోయింది. ఉక్రెయిన్‌ ప్లేయర్‌ లెసియా సురెంకో చేతిలో 6-1, 6-0 తేడాతో పరాజయం పాలైంది. మరో భారత ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు.

ఇదీ చదవండి:

కోర్టులో జకోవిచ్​కు ఊరట.. వీసా పునరుద్ధరణ

నంబర్​ వన్​గానే బరిలోకి జకోవిచ్.. ప్రాక్టీస్​ షురూ..

కొవిడ్‌ సోకినా విచ్చలవిడిగా తిరిగిన జకోవిచ్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.