ETV Bharat / sports

రయ్​ రయ్ షురూ.. నేటి నుంచే ఆస్ట్రేలియన్​ గ్రాండ్​ప్రి - హమిల్టన్​

కరోనా వైరస్‌ దెబ్బకు ఆటలు అటకెక్కేశాయి. ప్రపంచవ్యాప్తంగా మైదానాలు మూగబోయాయి. ఫార్ములావన్‌ ఇందుకేం మినహాయింపు కాదు. ఎప్పుడూ రయ్‌..రయ్‌ మంటూ చెవులు గిర్రుమనేలా మెరుపు వేగంతో దూసుకెళ్లే కార్లకు బ్రేకులు పడ్డాయి. కళకళలాడే ఎఫ్‌-1 మహమ్మారి ప్రభావానికి వెలవెలబోయింది.. కానీ బంధనాలు ఛేదించుకుని.. ఆటుపోట్లు తట్టుకుని మళ్లీ మొదలవుతోంది ఫార్ములావన్‌! ఇక శుక్రవారం నుంచి స్పీల్‌బర్గ్‌ ట్రాక్‌లో రయ్‌... రయ్‌నే!

Australian Grand Prix Racing Starts Froms Friday onwards
నేటి నుంచి ఆస్ట్రేలియన్​ గ్రాండ్​ప్రి రేసింగ్​ షురూ
author img

By

Published : Jul 3, 2020, 6:37 AM IST

మార్చి 13న ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి రూపంలో ఈ ఏడాది సీజన్‌ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా రేసు రద్దయింది. ఆ తర్వాత మళ్లీ మొదలు కాలేదు. ఇదొక్కటే కాదు వరుసగా పోటీలు రద్దవుతూ వచ్చాయి. ఒక దశలో ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌ప్రి అయినా జరుగుతుందా అనే అనుమానాలు రేకెత్తాయి. కానీ అంచనాలు తలకిందలు చేస్తూ ఎఫ్‌-1 వేగంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

సంబరాలు లేవు

ఐరోపా రేసులను ఎనిమిదికి కుదించి ఈ ఏడాది షెడ్యూల్‌ను సవరించి కొత్త తేదీలను ప్రకటించారు. సెప్టెంబరు 6న ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రితో ఈ రేసులకు తెరపడనుంది. ఒక్క జులైలోనే నాలుగు జీపీలు జరగాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఆస్ట్రియా జీపీ శుక్రవారం ఆరంభం కాబోతోంది. మొదటి రోజు ప్రాక్టీస్‌, రెండో రోజు క్వాలిఫయింగ్‌, ఆదివారం మూడో రోజు ప్రధాన రేసు జరగనుంది. ఆ తర్వాత ఇదే వేదికలో 10-12 తేదీల్లో మరో గ్రాండ్‌ప్రి కూడా నిర్వహిస్తారు. కిలో మీటర్ల పొడువునా జెండాలూపుతూ తమ ఇష్టమైన రేసర్లను ప్రోత్సహించే అభిమానులు, భారీ సిబ్బంది ఈసారి కనిపించరు. ఇది వరకులా షాంపైన్‌ సంబరాలు, హై ఫైలూ ఇకపై ఉండవు.

సంఘీభావం

'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమం ఎఫ్‌-1నూ తాకింది. అమెరికాలో పోలీసుల దుశ్చర్యకు నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ బలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో నల్లజాతీయుడు అయిన బ్రిటన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఫార్ములావన్‌లో ఈ నిరసనలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రేసు ఆరంభానికి ముందు రేసర్లందరూ మోకాళ్ల మీద కూర్చొని తమ సంఘీభావాన్ని తెలపనున్నారు!

"జాతివివక్ష గురించి మాట్లాడటానికి ఇప్పుడు నాకో వేదిక దొరికింది. జనాలను చైతన్యం చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే బాధ్యత లేనట్లే. ఫ్లాయిడ్​ బలైన తర్వాత తీవ్రమైన కోపం, బాధ కలిగాయి. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎన్నోసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నా". -హామిల్టన్​

నలుపు కారుతో నిరసన

అంతేకాదు ఎప్పడూ వెండి రంగుతో ఉన్న కారులో దూసుకుపోయే హామిల్టన్‌.. ఈసారి రేసింగ్‌కు పూర్తి నలుపు రంగు కారును వాడనున్నాడు. వరుస ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో హ్యాట్రిక్‌ సాధించిన హామిల్టన్‌ ఈ సీజన్లోనూ ఛాంప్‌గా నిలిస్తే ఎఫ్‌-1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల ఆల్‌ టైమ్‌ రికార్డును సమం చేస్తాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.