Asia Cup Hockey India: ఆసియా కప్ ఫైనల్‌కు వెళ్లలేకపోయిన భారత్.. కాంస్యం గెల్చుకుంది. బుధవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో జపాన్ను 1-0తో ఓడించింది. గేమ్ ఏడో నిమిషంలోనే ఫీల్డ్ గోల్‌తో భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు రాజ్ కుమార్ పాల్. వెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రతి క్వార్టర్లోనూ గోల్స్ కోసం ప్రయత్నించిన ప్రత్యర్థి జట్టును సమర్థంగా అడ్డుకోగలిగింది.
అంతకుముందు మంగళవారం.. ఫైనల్‌కు వెళ్లాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను కొరియాతో డ్రా (4-4) చేసుకుంది. దీంతో పసిడి ఆశలు ఆవిరయ్యాయి. మలేసియా, దక్షిణ కొరియా ఫైనల్లో బుధవారం సాయంత్రం తలపడనున్నాయి.
ఇవీ చూడండి: ఒకే ఒక్కడు 'షమి'.. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు
ఫ్రెంచ్ ఓపెన్‌లో జకోకు షాక్- మరో టైటిల్‌పై కన్నేసిన నాదల్