ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలో నిలిచిన భారత ఆర్చర్లు.. రికర్వ్ పురుషులు, మహిళలు, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మహిళల అర్హత రౌండ్లో భారత జట్టు అగ్రస్థానం కైవసం చేసుకుంది. ర్యాంకింగ్ రౌండ్లో అంకిత భకత్ (673) ద్వితీయ, దీపిక కుమారి (671) తృతీయ స్థానాల్లో నిలిచారు. కోమలిక బారి (659) 12వ స్థానం సాధించింది. ఓవరాల్‌గా భారత్‌కు అగ్రస్థానం దక్కింది.
పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో అతాను దాస్ (680) ద్వితీయ, ప్రవీణ్ జాదవ్ (666) 15వ, ధీరజ్ బొమ్మదేవర (664) 20వ స్థానాల్లో నిలవడం సహా ఓవరాల్‌గా భారత్ మూడో స్థానం సాధించింది. నిరుడు పెళ్లితో ఒక్కటైన అతాను దాస్, దీపిక కుమారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వార్టర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
2019 జులై తర్వాత ప్రపంచకప్ సర్క్యూట్ టోర్నీలో బరిలో దిగడం భారత జట్టుకు ఇదే తొలిసారి.