ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 'లెజెండ్స్ ఆఫ్ చెస్' టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మంగళవారం ప్రారంభంకానున్న ఈ పోటీల్లో తొలి రౌండ్లో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో ఆనంద్ తలపడనున్నారు. మాగ్నస్ కార్ల్సన్ చెస్ టూర్లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఆన్లైన్లో పోటీలు జరుగుతాయి.
ప్రపంచ ఛాంపియన్ కార్ల్సన్ (నార్వే), వ్లాదిమిర్ క్రామ్నిక్, అనీశ్ గిరి, పీటర్ లెకో, ఇయాన్ నెపోమచి, బోరిస్ గెల్ఫాండ్, డింగ్ లిరెన్, వాసిల్ ఇవాంచుక్లు లెజెండ్స్ ఆఫ్ చెస్ బరిలో ఉన్నారు. ఈ టోర్నీ విజేత ఆగస్టు 9 నుంచి 20 వరకు జరిగే గ్రాండ్ ఫైనల్కు అర్హత సాధిస్తాడు. ఇప్పటికే కార్ల్సన్, డానిల్ దుబోవ్ (రష్యా) ఫైనల్ టోర్నీ బెర్తులు ఖాయం చేసుకున్నారు.