ETV Bharat / sports

ప్రపంచకప్​ బాక్సింగ్​లో అమిత్​ పంగల్​కు స్వర్ణం

author img

By

Published : Dec 20, 2020, 6:37 AM IST

బాక్సింగ్​ ప్రపంచకప్​లో భారత బాక్సర్​ అమిత్​ పంగల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 52 కేజీల ఫైనల్లో జర్మనీకి చెందిన టెర్టెర్​యాన్​పై విజయం సాధించాడు. మరోవైపు 57 కేజీల సెమీస్​లో హైదరాబాదీ హుసాముద్దీన్​ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ​

Amit Panghal clinches gold, injured Satish bags silver at Cologne World Cup
ప్రపంచకప్​ బాక్సింగ్​లో అమిత్​ పంగాల్​కు స్వర్ణం

ప్రపంచకప్‌ బాక్సింగ్‌లో అమిత్‌ పంగల్‌ స్వర్ణం గెలిచాడు. జర్మనీలో జరుగుతున్న టోర్నీలో 52 కేజీల ఫైనల్లో టెర్టెర్‌యాన్‌ (జర్మనీ) వాకోవర్‌ ఇవ్వడం వల్ల పసిడి పంగల్‌ సొంతమైంది. మరోవైపు 57 కేజీల సెమీస్‌లో హైదరాబాదీ హుసాముద్దీన్‌ జోరుకు బ్రేక్​ పడింది. అతను స్థానిక ఆటగాడు హస్మత్​ షాద్లోవ్​ చేతిలో పరాజయం చవిచూసి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇదే కేటగిరి సెమీస్​లో గౌరవ్​ సోలంకీ.. శామ్యూల్​ (ఫ్రాన్స్​) చేతిలో ఓటమి పాలయ్యాడు.

91+ కేజీల సెమీస్‌లో 4-1తో మొయింజె (ఫ్రాన్స్​)ను ఓడించి ఫైనల్​ చేరిన సతీశ్​ కుమార్.. గాయం కారణంగా బౌట్​ నుంచి తప్పుకుని రజతంతో సంతృప్తి పడ్డాడు. 57 కేజీల విభాగంలో సాక్షి, మనీషా కూడా తుది సమరానికి అర్హత సాధించారు. సెమీస్​లో మనీషా 5-0తో భారత్​కే చెందిన సోనియాపై, సాక్షి 4-1తో రమోనా (జర్మనీ)పై గెలిచారు. ఫైనల్లో స్వర్ణం కోసం మనీషాతో సాక్షి తలపడనుంది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత పూజా రాయ్​ కూడా కంచుకే పరిమితమైంది. ​

ఇదీ చూడండి: టోక్యో ఒలింపిక్స్​ వ్యయం భారీగా పెరగనుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.