ETV Bharat / sports

సానియా-షోయబ్ విడాకులు నిజమేనా? లేక రియాలిటీ షో కోసం జిమ్మిక్కులా? - సానియా మీర్జా షోయబ్​ మాలిక్ రియాలిటీ షో

భారత స్టార్​ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాకిస్థాన్​ క్రికెటర్​ షోయమ్​ మాలిక్​.. విడాకుల విషయం ప్రస్తుతం నెట్టింట్లో హాట్​ టాపిక్​గా మారింది. తాజాగా సానియా, షోయబ్​లు​ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 13, 2022, 3:57 PM IST

ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్​ షోయబ్​ మాలిక్​ విడాకులపై గత కొద్దిరోజులుగా నెట్టింట్లో చర్చ నడుస్తోంది. వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తలు సోషల్​ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. వాటన్నింటికీ తెరతీస్తూ సానియా, మాలిక్​ కలిసి ఉర్దూఫ్లిక్స్​ వేదికగా ఒక రియాలిటీ షో చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రకటనతో మరిన్ని సందేహాలు తలెత్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. విడాకుల విషయం గురించి మీర్జా గానీ, మాలిక్​ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. దీంతో విడాకుల విషయం అబద్దమా లేక రియాలిటీ షో కోసం హైప్​ క్రియేట్​ చేయడంలో భాగమా? అంటూ సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ఇప్పటికీ ఇన్​స్టాలో మాలిక్​ను సానియా ఫాలో అవుతోంది. కానీ ఇటీవల సానియా పెట్టిన పోస్టులు మాత్రం విడాకుల వార్తలను నిజం చేసేలాగే ఉన్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేటట్లు మరో విషయం బయటకు వచ్చింది. సానియా, మాలిక్ దుబాయ్​లోని పామ్​ జుమేరియాలోని ఓ విల్లాలో ఉండేవారట. ప్రస్తుతం సానియా అక్కడినుంచి వేరే అపార్ట్​​మెంట్​కు వెళ్లినట్లు సమాచారం.

దీనికి తోడు షోయబ్​ మాలిక్​ ఇటీవల సానియా గురించి ఓ క్రికెట్​ షోలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సానియా టెన్నిస్​ అకాడమీల లొకేషన్​ గురించి అడిగితే అంతగా తెలియదని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ఆ షో వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరచింది. 2010లో వివాహ బంధంతో ఒక్కటైన సానియా, మాలిక్​.. అప్పటి నుంచి దుబాయ్​లో ఉంటున్నారు. జనవరిలో తాను టెన్నిస్​ నుంచి రిటైర్మెంట్​ తీసుకుంటున్నట్లు సానియా ప్రకటించింది.

ఇవీ చదవండి : ఆసీస్ ఆల్​రౌండర్ కాలికి గాయం..​ ఆటకు గ్లెన్​ మ్యాక్స్​వెల్ దూరం

'ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అడిగా..' సైకిల్‌పైనే అకాడమీకి.. కఠోర శ్రమతో జట్టులోకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.