రాహుల్ పణిక్కర్.. కొచ్చికి చెందిన జాతీయ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్. మరి లారీ వీల్స్.. ఆరు అడుగుల పైనే ఎత్తుండే అమెరికన్, ప్రపంచంలోనే బలవంతుడైన బాడీ బిల్డర్. రాహుల్ బరువు కేవలం 70 కిలోలు కాగా.. లారీ వీల్స్ బరువు సుమారు 115 కేజీలు. మరి వీరిద్దరి మధ్య ఆర్మ్ రెజ్లింగ్ (చేతులతో సాగే కుస్తీ ప్రదర్శన) చోటుచేసుకుంటే.. గెలుపెవరిది?
రాహుల్ పణిక్కర్ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన తండ్రి 'పవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' బిరుదు గెలుచుకున్నారట. ఆయన బంధువులు, కుటుంబసభ్యుల్లో పలువురు ఫిట్‌నెట్ పట్ల మక్కువ ఉన్నవారే. వారి వల్లే తనకు క్రీడల పట్ల ఆసక్తి లభించిందని రాహుల్ అంటారు. ఇక అమెరికాకు చెందిన లారీ వీల్స్ ప్రపంచంలోనే మేటి బాడీ బిల్డర్. సామాజిక మాధ్యమాల్లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 367 కిలోలకు పైగా బరువును ఎత్తగల వీల్స్ పేరుమీద అనేక పవర్ లిఫ్టింగ్ రికార్డులున్నాయి. ఐతే అతనికి ఇటీవల ఎదురైన ఓ విభిన్న సామర్థ్య పరీక్షలో ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ అదేంటంటే..
భిన్న ధృవాలనదగ్గ ఈ ఇద్దరి మధ్య ఇటీవల దుబాయిలో ఆర్మ్ రెజ్లింగ్ పోటీ జరిగింది. వీల్స్ భారీకాయం ముందు రాహుల్ చిన్న బొమ్మలాగా కనిపించాడు. మొత్తం ఐదు రౌండ్ల ఈ పోటీలో తొలుత విజయం వీల్స్ వైపే మొగ్గింది. ఐనా చెక్కు చెదరని రాహుల్.. మిగిలిన మూడు రౌండ్లలో నిబ్బరంగా పుంజుకుని ప్రత్యర్థిని ఖంగు తినిపించాడు. మరి ఈ రసవత్తరంగా సాగిన ఈ పోటీ తీరును, ప్రేక్షకుల హావభావాలను, రాహుల్ విజయాన్ని ఈ వీడియోలో చూసేయండి.
-
Rahul Panikkar a techie from kochi in Kerala beats word champion Larry wheels worlds strongest body builder. pic.twitter.com/zwNNTlDDrP
— Aviator Anil Chopra (@Chopsyturvey) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rahul Panikkar a techie from kochi in Kerala beats word champion Larry wheels worlds strongest body builder. pic.twitter.com/zwNNTlDDrP
— Aviator Anil Chopra (@Chopsyturvey) January 7, 2021Rahul Panikkar a techie from kochi in Kerala beats word champion Larry wheels worlds strongest body builder. pic.twitter.com/zwNNTlDDrP
— Aviator Anil Chopra (@Chopsyturvey) January 7, 2021