All England Open Laskshya Sen: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ దూసుకెళ్తున్నాడు. సెమీఫైనల్లో మలేసియాకు చెందిన లీ జియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. 21-13, 12-21, 21-19 తేడాతో గెలుపొందాడు.
రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్‌ను ఓడించి మరీ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్యసేన్‌కు అదృష్టం కలిసొచ్చింది. క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు లు జువాంగ్ జు తప్పుకోవడం (వాకోవర్) వల్ల లక్ష్యసేన్ సెమీస్‌కు చేరుకున్నాడు. ఇప్పటికే సింగిల్స్ విభాగంలో కిదాంబి రెండో రౌండ్‌లో వెనుదిరగగా.. మహిళల విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి పాలయ్యారు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్న లక్ష్యసేన్ అప్పటి నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత వారం జరిగిన జర్మన్ ఓపెన్‌లో అతడు రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించాడు.
మెన్స్ సింగిల్స్‌లో.. ఆల్ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన నాలుగో భారత షట్లర్ లక్ష్యసేన్ కావడం విశేషం. అంతకుముందు ప్రకాశ్ నాథ్, ప్రకాశ్ పదుకొణె, పుల్లెల గోపీచంద్ ఈ టోర్నీ ఫైనల్‌కు చేరారు. పదుకొణె(1980), గోపీచంద్(2001) విజయం సాధించగా.. నాథ్(1947) ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 2015లో ఫైనల్లో ఓడిపోయింది.
ఇదీ చదవండి: Asia Cup 2022: శ్రీలంకలో ఆసియా కప్.. ఆగస్టు నుంచి మ్యాచ్‌లు..